US Elections 2020: ఓటమిని అంగీకరించు, వైట్ హౌజ్ ఖాళీ చేసేద్దాం- ట్రంప్ భార్య

Melania Trump Trying To convince Donald Trump |  ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠతల మధ్య అమెరికా ఎన్నికల ( US Elections 2020) ఫలితాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ( Joe Biden) గెలుపు సాధించాడు.

Last Updated : Nov 9, 2020, 03:05 PM IST
    • ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠతల మధ్య అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపు సాధించాడు.
    • త్వరలో అతను అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
    • కానీ ఇప్పటికీ డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఏదో మ్యాజిక్ జరుగుతుంది అని ఆశిస్తున్నాడట.
    • తను గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయి అని..ఓడిపోలేదు అని.. అందుకే వైట్ హౌజ్ ఖాళీ చేసేది లేదు అని మొండిపట్టుపట్టాడట ట్రంప్.
US Elections 2020: ఓటమిని అంగీకరించు, వైట్ హౌజ్ ఖాళీ చేసేద్దాం- ట్రంప్ భార్య

Donald Trump in White House | ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠతల మధ్య అమెరికా ఎన్నికల ( US Elections 2020) ఫలితాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ( Joe Biden) గెలుపు సాధించాడు. త్వరలో అతను అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. కానీ ఇప్పటికీ డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాత్రం ఏదో మ్యాజిక్ జరుగుతుంది అని ఆశిస్తున్నాడట. తను గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయి అని..ఓడిపోలేదు అని.. అందుకే వైట్ హౌజ్ ( White House ) ఖాళీ చేసేది లేదు అని మొండిపట్టుపట్టాడట ట్రంప్.

Also Read  | Donald Trump: మెలానియా విడాకులు ఇచ్చేస్తుందా ? రహస్యాలు వెల్లడించిన పీఏ!

డోనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ( Melania Trump) మాత్రం నిజాన్ని ఎప్పుడో అంగీకరించి ఈ విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ తో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారట. "నీ ఓటమిని అంగీకరించు, మనం శ్వేతసౌధం ఖాళీ చేసి వెళ్లాల్సిందే అదే మనకు మర్యాద" అని చెప్పడానికి ప్రయత్నిస్తోందట. మెలానియా ట్రంప్ తో పాటు డోనాల్డ్ ట్రంప్ సన్నిహితులు కూడా ఓటమిని అంగీకరించమని సలహా ఇస్తున్నారట.

Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

జో బైడన్ అమెరికా అధ్యక్షుడిగా ( Joe Biden The 46h President Of America )  అవనున్నట్టు వస్తున్న వార్తలను ట్రంప్ ఖండిస్తూ.. విజయాన్ని ప్రకటించే విషయంలో బైడెన్ చాలా తొందరపాటు చూపిస్తున్నాడు అని ఇటీవలే వ్యాఖ్యానించాడు. ఫలితాలు తేటతెల్లం అయ్యాక కూడా ట్రంప్ ఇలా మొండివైఖరి ప్రదర్శించడం సరికాదు అని అర్థం చేసుకున్న మెలానియా ట్రంప్.. ఓటమిని అంగీకరించి మర్యాదగా వైట్ హౌజ్ నుంచి గౌరవంగా వెళ్లిపోవడమే ఉత్తమం అని కోరుతున్నారట. మరి డోనాల్డ్ ట్రంప్  తన భార్య మాట వింటాడో లేదో వేచి చూడాల్సిందే.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News