మెక్సికోలో భారీ భూకంపం..తీవ్రత 7.2గా నమోదు

అకస్మాత్తుగా సంభవించిన భారీ భూకంపంతో దక్షిణ, మధ్య మెక్సికో భీతిల్లింది.

Last Updated : Feb 17, 2018, 05:49 PM IST
మెక్సికోలో భారీ భూకంపం..తీవ్రత 7.2గా నమోదు

ఉత్తర అమెరికా ఖండంలో భూమి కంపించింది. అకస్మాత్తుగా సంభవించిన భారీ భూకంపంతో దక్షిణ, మధ్య మెక్సికో భీతిల్లింది. శుక్రవారం సాయంత్రం సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైంది. యూఎస్ జియోలాజికల్ సర్వే తొలుత ఈ భూకంప తీవ్రత 7.5గా నమోదైందని తెలిపారు. ఆ తరువాత సమీక్షించి 7.2 తీవ్రతగా నమోదు చేశారు. భూకంప కేంద్రం ఓనాకా రాష్ట్రంలో పినోటేపాకు 33 మైళ్ళ దూరంలో ఉంది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఐదు నెలల క్రితం మెక్సికోలో సంభవించిన భూకంపం వల్ల దేశంలో 370 మంది మరణించారు.

Trending News