Meta Fired 11000 employees: మెటాలో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన

Why Meta Fired 11000 employees: మెటా సంస్థలో 11 వేల మంది ఉద్యోగులను ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే ప్రశ్నలపై మార్క్ జుకర్ బర్గ్ స్పందిస్తూ చేసిన ప్రకటన చూస్తే.. భవిష్యత్తులో మెటా కంపెనీ మరింత మంది ఉద్యోగులను పక్కకు పెట్టే అవకాశం లేకపోలేదని అర్థమవుతోంది.

Written by - Pavan | Last Updated : Nov 9, 2022, 08:22 PM IST
Meta Fired 11000 employees: మెటాలో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన

Why Meta Fired 11000 employees: ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా సంస్థ 11,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాలో రిసెషన్ వస్తుందని ఆర్థిక నిపుణుల హెచ్చరికల మధ్యే ఇటీవలే ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్, తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ భారీగా ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం కార్పొరేట్ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఇటీవల ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ 3,500 మంది కంటే ఎక్కువ ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ట్విటర్ కంపెనీలో పనిచేసే మొత్తం సిబ్బందితో పోల్చుకుంటే ఇది 10 శాతానికి సమానం. తాజాగా మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తొలగించిన 11 వేల మంది సిబ్బంది సంఖ్య అంతకంటే ఎక్కువ. మెటాలో మొత్తం ఉద్యోగుల సంఖ్యతో పోల్చుకుంటే.. ఉద్యోగం కోల్పోయిన వారి సంఖ్య 13 శాతంగా ఉంది.

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మెటా సంస్థ ప్రతికూల ఫలితాలను చవిచూసింది. ఆదాయం పడిపోయిన నేపథ్యంలోనే మెటా సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదే విషయమై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్పందిస్తూ.. '' వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేశాడు. మెటా చరిత్రలోనే ఇదొక కష్టతరమైన, కఠిన నిర్ణయంగా మార్క్ జుకర్‌బర్గ్ అభివర్ణించాడు. సంస్థను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడం కోసం ఇంకొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పదు " అని మార్క్ జుకర్‌బర్గ్ తేల్చిచెప్పాడు. 

మార్క్ జుకర్ బర్గ్ చేసిన ప్రకటన చూస్తే.. భవిష్యత్తులో మెటా కంపెనీ మరింత మంది ఉద్యోగులను పక్కకు పెట్టే అవకాశం లేకపోలేదని అర్థమవుతోంది. తాను తీసుకున్న నిర్ణయం ఇబ్బందికరమైనదేనని తనకు తెలుసు. కానీ సంస్థను గాడిలోపెట్టడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోక తప్పలేదని ప్రకటించిన మార్క్ జుకర్ బర్గ్.. తాను తీసుకున్న నిర్ణయం కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు. మెటాలో ఉద్యోగం కోల్పోయిన వాళ్లందరికీ ఒక మెయిల్ వస్తుందని.. వారికి అందే ఫినాన్షియల్ బెనిఫిట్, వర్కింగ్ డేస్ లాంటి వివరాలన్నీ అందులో పేర్కొనడం జరుగుతుందని వివరించాడు. అలాగే వారి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మార్క్ జుకర్‌బర్గ్ ( Mark Zuckerberg ) స్పష్టంచేశాడు.

Also Read : Twitter India: ఉద్యోగులకు కోలుకోలేని షాక్.. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు..

Also Read : Shorts On Smart TVs: ఇక స్మార్ట్ టీవీల్లోనూ యూట్యూబ్ షార్ట్స్

Also Read : Share Market: షేర్ మార్కెట్‌లో సంపాదనకు అద్బుత అవకాశం, త్వరలో మద్యం తయారీ కంపెనీ ఐపీవో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News