China Earthquake: అర్ధరాత్రి అందరూ గాఢనిద్రలో ఉండగా చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీగా భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సార్లు భూమి కంపించడంతో తీవ్రత అధికమైంది. అత్యధికంగా 7.1 తీవ్రత నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చైనా కిర్గిస్థాన్-జిన్జియాంగ్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు అందరూ గాఢనిద్రలో ఉండగా భారీగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. ఆస్థి, ప్రాణ నష్టం ఎక్కువగానే ఉండవచ్చని తెలుస్తోంది. తెల్లవారుజామున 2 గంటల 9 నిమిషాలకు అత్యధికంగా 7.1 తీవ్రత నమోదు కాగా ఆ తరువాత 4 గంటల వరకూ 14 సార్లు కంపించింది. చైనా భూకంపం ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. ట్రాక్‌లు దెబ్బతినడంతో చాలా రైళ్లు రద్దయ్యాయి. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సేవల విభాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం యాక్టివేట్ చేసింది. సహాయక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చైనాలో గత 24 గంటల వ్యవధిలో చాలాసార్లు భూమి కంపించింది. అటు పొరుగు దేశం కజికిస్థాన్లోని ఆల్మటీలో 6.7 తీవ్రత నమోదైంది. దాంతో జనం భయంతో బయటకు పరుగులు తీశారు.
చైనాలో భూకంపం ధాటికి ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియలేదు. ఆయితే ఆస్థి, ప్రాణ నష్టం భారీగానే ఉండవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే భూకంపం ధాటికి చాలా భవనాలు నేలకూలాయి. భూకంప కేంద్రం చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో 27 కిలోమీటర్ల లోతు వరకూ వ్యాపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంపం ధాటి ఎంత ఉందంటే...1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీలో కూడా ప్రకంపనలు కన్పించాయి.
Also read: Anganwadi Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం, సమ్మె విరమించిన అంగన్‌వాడీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook