అక్కడ 'లాక్ డౌన్'కు ముగింపు..!!

'కరోనా వైరస్' .. అగ్రరాజ్యం అమెరికాను కుదుపేస్తోంది. శరవేగంగా విస్తరిస్తున్న వైరస్.. అమెరికాలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. చైనా, ఇటలీ,స్పెయిన్ కంటే కరోనా వైరస్ మృతులు అమెరికాలోనే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం అమెరికా అంతటా లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ లాక్ డౌన్ కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది.

Last Updated : Apr 28, 2020, 10:28 AM IST
అక్కడ 'లాక్ డౌన్'కు ముగింపు..!!

'కరోనా వైరస్' .. అగ్రరాజ్యం అమెరికాను కుదుపేస్తోంది. శరవేగంగా విస్తరిస్తున్న వైరస్.. అమెరికాలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది. చైనా, ఇటలీ,స్పెయిన్ కంటే కరోనా వైరస్ మృతులు అమెరికాలోనే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం అమెరికా అంతటా లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ లాక్ డౌన్ కారణంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది.

మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై ఉండడానికి జనం ఇష్టపడడం లేదు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇళ్లల్లో ఉండడానికి జనం చిరాకు పడుతున్నారు. దీంతో టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం ప్రకటించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ ఏప్రిల్ 30  వరకు మాత్రమే అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అంతే కాదు లాక్ డౌన్ పొడగించే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదని తెలిపారు. 

టెక్సాస్ గవర్నర్ ప్రకటించిన దాని ప్రకారం.. ఏప్రిల్ 30 తర్వాత అన్ని దుకాణాలు తెరుచుకోనున్నాయి. మాల్స్, రెస్టారెంట్లు, థియేటర్లు అన్నీ పునఃప్రారంభిస్తారు. కానీ జనం తక్కువగా ఉండేలా చూసుకోవడం ఆయా దుకాణ యజమానులు లేదా సిబ్బంది బాధ్యతగా ఉంటుంది. దుకాణాలు లేదా మాల్స్, థియేటర్లలో కేవలం 25 శాతం మంది కంటే ఎక్కువగా అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు.  
   

సెలూన్లు, జిమ్ లు, బార్లు కూడా తెరుచుకోవచ్చని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. ఐతే మధ్యాహ్నం నుంచి మాత్రమే వాటికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్సాస్ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. కానీ ఆయా దుకాణాలు, షాపింగ్ మాల్స్, థియేటర్లలో పని చేస్తున్న సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత   ఆయా దుకాణాల యజమానులదేనని చెప్పారు. దుకాణాలకు వచ్చే వినియోగదారులు  కూడా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఫేస్ మాస్క్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. 

మరోవైపు అమెరికాలోని మిగతా రాష్ట్రాలకు విరుద్ధంగా టెక్సాస్ గవర్నర్ లాక్ డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్నారు. మిగతా రాష్ట్రాలన్నీ అంచలంచలుగా లాక్ డౌన్ ఎత్తివేయాలని ఆలోచిస్తుండగా.. టెక్నాస్ గవర్నర్ ఈ నిర్ణయం  తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News