Breaking News : ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఇక లేరు

ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఇక లేరు

Last Updated : Aug 19, 2018, 01:46 PM IST
Breaking News : ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ ఇక లేరు

ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ కోఫి అన్నన్(80) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన కోఫి అన్నన్ స్విట్జర్లాండ్‌లో ప్రశాంతంగా కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు ఆయన ట్విటర్ హ్యాండిల్ ద్వారానే ప్రపంచానికి తెలియజేశారు. కోఫి అన్నన్ మృతిపట్ల ప్రపంచ దేశాధినేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఐక్య రాజ్య సమితికి 7వ ప్రధాన కార్యదర్శిగా 1997 నుంచి 2006 వరకు కోఫీ అన్నన్ సేవలు అందించారు. కోఫీ అన్నన్ సేవలకుగాను 2001లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఘనాకు చెందిన కోఫీ అన్నన్ గత కొంతకాలంగా జెనివాలో స్థిరపడ్డారు. 

 

 

Trending News