Global Passport Rank: అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జపాన్‌దే..ఇండియా పాస్‌పోర్ట్ స్థానమేది

Global Passport Rank: ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలకు ర్యాంకింగ్ ఇచ్చే సంస్థలుంటాయి. అదే విధంగా వివిధ దేశాల పాస్‌పోర్ట్‌లకు కూడా ర్యాంకింగ్ ఉంటుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో జపాన్‌కు అగ్రస్థానం లభించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 20, 2022, 04:46 PM IST
Global Passport Rank: అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జపాన్‌దే..ఇండియా పాస్‌పోర్ట్ స్థానమేది

Global Passport Rank: ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాలకు ర్యాంకింగ్ ఇచ్చే సంస్థలుంటాయి. అదే విధంగా వివిధ దేశాల పాస్‌పోర్ట్‌లకు కూడా ర్యాంకింగ్ ఉంటుంది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో జపాన్‌కు అగ్రస్థానం లభించింది. 

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 నుంచి కోలుకోవడంతో పాస్‌పోర్ట్‌లకు ర్యాంకింగ్ ఇచ్చే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ మరోసారి జాబితా వెలువరించింది. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అంటే ఏ దేశపు పాస్‌పోర్ట్ స్ట్రాంగ్, ఏ దేశపు పాస్‌పోర్ట్ వీక్ ఆధారంగా ర్యాంకింగ్ నిర్ణయించేది. 17 సంవత్సరాల డేటా అధారంగా ఈ జాబితా రూపొందింది. ఇందులో జపాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా ఖ్యాతికెక్కింది. జపాన్ తరువాత రెండు, మూడు స్థానాల్లో సింగపూర్, దక్షిణ కొరియా దేశాలున్నాయి. 190 దేశాలతో ఫ్రీ యాక్సిస్ ఉండి జర్మనీ, స్పెయిన్ 4, 5 స్థానాల్లో నిలిచాయి. 

శక్తివంతమైన పాస్‌పోర్ట్ అంటే

జపాన్ దేశపు పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తి 193 దేశాల్లో ఏ విధమైన ఇబ్బందుల్లేకుండా సులభంగా ప్రవేశించగలడు. అదే విధంగా సింగపూర్, దక్షిణ కొరియా దేశాల పాస్‌‌పోర్ట్ కలిగిన వ్యక్తి కూడా సులభంగా ఇతర దేశాలకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా వెళ్లగలడు. పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ అనేది మొబిలిటీ స్కోర్ ఆధారంగా ఉంటుంది. ఎంత ఎక్కవ మొబిలిటీ స్కోర్ ఉంటే అంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా పరిగణిస్తారు. వీసా ఫ్రీ, వీసా ఆన్ ఎరైవల్‌ను అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఇది ఉంటుంది. 

ప్రపంచ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్, ఇండియా స్థానమెక్కడ

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా పాస్‌పోర్ట్ ఏకంగా 87వ స్థానంలో ఉంది. నేపాల్, ఇండోనేషియా, భూటాన్, మకావ్ సహా 60 దేశాలకు ఇండియా పాస్‌పోర్ట్‌తో ఇబ్బందుల్లేకుండా వెళ్లవచ్చు. 2021లో 1.6  లక్షలమంది దేశ పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. ఇందులో అత్యధికంగా అంటే 78 వేల 284 మంది అమెరికా పౌరసత్వం పొందగా..23 వేల 533 మంది ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు. 21 వేల 597 మంది కెనడా పౌరసత్వం, 14 వేల 637 మంది ఇంగ్లండ్ పౌరసత్వం పొందారు. 

Also read: Srilanka New President: శ్రీ 'లంకాధి'పతిగా రణిల్ విక్రమసింఘే...

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News