Israel Attack: ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు, 7 మంది మృతి

Israel Attack: ఇజ్రాయిల్ దమనకాండ కొనసాగుతోంది. ఓ వైపు పాలస్తీనాపై యుద్ధం చేస్తూనే ఇరాన్‌తో కయ్యానికి కాలుదువ్వింది.య సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 2, 2024, 12:38 PM IST
Israel Attack: ఇరాన్ దౌత్య కార్యాలయంపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు, 7 మంది మృతి

Israel Attack: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజాలో నెలకొన్న సంక్షోభం నేపధ్యంలో పొరుగున ఉన్న ప్రత్యర్ది దేశాలపై దాడులు ప్రారంభించింది. సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయంపై జరిపిన దాడిలో 11 మంది మరణించారు. అయితే ఈ దాడి కావాలని చేసిందా లేక గురి తప్పిన దాడా అనేది తేలాల్సి ఉంది.

గాజాలో హమాస్‌పై దాడి వంకతో పాలస్తీనాతో యుద్ధం చేస్తూ విద్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయిల్ ఇరాన్ మిత్రదేశాల్ని సైతం లక్ష్యంగా చేసుకుంటోంది. తరచూ పొరుగున ఉన్న శత్రుదేశాలపై దాడులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్ దౌత్య కార్యాలయంలో వైమానిక దాడులు జరిపింది. ఏకంగా 6 మిస్సైల్స్ ఇరాన్ రాయబార కార్యాలయంపై దూసుకొచ్చాయి. ఎఫ్ 35 ఫైటర్ జెట్స్ ద్వారా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 11 మంది మరణించారు. ఈ దాడుల్లో ఇరాన్ మిలిటరీ సలహాదారుడు జనరల్ అలీ రెజా జెహ్‌దీ మరణించారు. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడులపై ఇజ్రాయిల్ అధికారికంగా స్పందించకపోయినా దాడులు జరిపింది ఇజ్రాయిలేనని తెలుస్తోంది. 

ఇరాన్ దౌత్య కార్యాలయంపై జరిపిన వైమానిక దాడికి ఇజ్రాయిల్ దేశం మూల్యం చెల్లించుకోకతప్పదని లెబనాన్ రెబెల్ గ్రూప్ హిజ్బూల్లా స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ ఇతర దేశాలు సహాయం అందిస్తున్నాయనేది ఇజ్రాయిల్ ఆరోపణగా ఉంది. అందుకే ప్రతీకార చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. 

మరోవైపు గాజా ఆసుపత్రి నుంచి ఇజ్రాయిల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. రెండువారాల దాడుల తరువాత దాదాపు 200 మంది ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు ప్రకటించి సైన్యాన్ని ఉపసంహరించుకుంది. అల్ జజీరా ఛానెల్ ప్రసారానలు ఇజ్రాయిల్ బ్యాన్ చేసింది. 

Also read: Ice Melting: అంటార్కిటికా మంచు శిఖరాల్లో కుదించుకుపోతున్న మంచు దేనికి సంకేతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News