'చాబహర్ పోర్ట్' ను ప్రారంభించిన రౌహానీ

ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ లు ఇప్పుడు మరింతగా దగ్గరవుతున్నాయి. ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ప్రారంభించారు.

Last Updated : Dec 4, 2017, 01:11 PM IST
'చాబహర్ పోర్ట్' ను ప్రారంభించిన రౌహానీ

ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ లు ఇప్పుడు మరింతగా దగ్గరవుతున్నాయి. ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ చాబహర్ నౌకాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే పాకిస్థాన్ తో సంబంధం లేకుండా భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లు సముద్రమార్గం ద్వారా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పోర్ట్ నిర్మాణంలో భారత్ పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ లోని సిస్టాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఈ పోర్టు ఉంది. ఈ పోర్టుతో ఇండియా పశ్చిమ తీరంలో ఉన్న పోర్టులు అనుసంధానం అవుతాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకకు భారత్ తరుపున నౌకాయాన సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. చైనా పెట్టుబడుల సహాయంతో పాకిస్థాన్ లో నిర్మించిన గాద్వర్ పోర్ట్ కు చాబహర్ నౌకాశ్రయం దగ్గరలో ఉండటం విశేషం.

ప్రారంభోత్సవానికి ముందు ఇరాక్-భారత్- ఆఫ్ఘానిస్తాన్ మంత్రుల స్థాయి భేటీ జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చారు. 

Trending News