Iran Earthquake: ఇరాన్‌ని షేక్ చేసిన భూకంపం.. 165 మందికి గాయాలు

Iran Earthquake Latest News Updates: జనవరి నెల చివరలోనూ ఖోయ్ కౌంటీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో ముగ్గురు చనిపోగా మరో 800 మందికి పైగా జనం గాయపడ్డారు. ఆ తరువాత అదే ఖోయ్ కౌంటిలో మళ్లీ ఇంతటి అధిక తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 08:46 AM IST
Iran Earthquake: ఇరాన్‌ని షేక్ చేసిన భూకంపం.. 165 మందికి గాయాలు

Iran Earthquake Latest News Updates: టెహ్రాన్: ఇరాన్‌లో భూకంపం సంభవించింది. వాయువ్య ఇరాన్‌లో 5.6 మ్యాగ్నిట్యూడ్‌తో సంభవించిన ఈ భూకంపంలో 165 మంది గాయపడ్డారు. ఇరాన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించిన వివరాల ప్రకారం పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని ఖోయ్ కౌంటీ సమీపంలో శుక్రవారం ఉదయం 6:46 గంటలకు భూకంపం సంభవించింది.  భూకంప కేంద్రం 8 కి.మీ లోతున ఉన్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA వెల్లడించింది.

ఈ భూకంపంలో గాయపడిన 165 మందిని ఆస్పత్రిలో చేర్పించగా.. వారిలో 139 మంది ప్రథమ చికిత్స పొందిన అనంతరం ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. మిగతా వారు ఇంకా ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. పశ్చిమ అజర్‌బైజాన్ ప్రావిన్షియల్ గవర్నర్ మొహమ్మద్-సాడెక్ మోటమీడియన్‌ ఈ వివరాలు వెల్లడించినట్టుగా ఇరాన్ అధికారిక వార్తా సంస్థ కథనం పేర్కొంది.

సల్మాస్, ఖోయ్ కౌంటీలలోని 10 గ్రామాలలో 80 వరకు గృహాలు భూకంపం ధాటికి దెబ్బతిన్నాయని పశ్చిమ అజర్‌బైజాన్ హౌసింగ్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ జాఫర్ బార్జెగర్ ఇరాన్ అధికారిక వార్తా సంస్థకి చెప్పినట్టుగా షిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. జనవరి నెల చివరలోనూ ఖోయ్ కౌంటీలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపంలో ముగ్గురు చనిపోగా మరో 800 మందికి పైగా జనం గాయపడ్డారు. ఆ తరువాత అదే ఖోయ్ కౌంటిలో మళ్లీ ఇంతటి అధిక తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి. అయితే అదృష్టవశాత్తుగా ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి : Earthquake in North India: ఆఫ్ఘాన్ లో భారీ భూకంపం.. వణికిన ఉత్తర భారతం.. 9 మంది మృతి

ఇది కూడా చదవండి : Ecuador Earthquake: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి

ఇది కూడా చదవండి : Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News