UNSC Presidency: ఐక్యరాజ్యసమితిలో ఇండియా అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా భద్రతామండలిలో అధ్యక్ష పదవిని చేపట్టింది. ఇండియాకు పూర్తి సహకారాలు అందిస్తామంటున్నాయి మిత్రదేశాలు.
యునైటెడ్ నేషన్స్ ఆర్గనేజైషన్ సెక్యూరిటీ కౌన్సిల్(UNSC)లో ఇండియాకు తాత్కాలిక సభ్యదేశంగానే కొనసాగుతోంది. అయినా సరే ఏకంగా భద్రతామండలికి అధ్యక్షత వహించే అరుదైన కీర్తి సాధించింది. భద్రతామండలి అధ్యక్ష పదవి చేపట్టిన ఇండియా...2022 వరకూ ఇదే పదవిలో కొనసాగనుంది. ఈ పదవి చేపట్టడం ఇండియాకు ఇదే తొలిసారి. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటం, శాంతి భద్రతల పరిరక్షణ, సముద్ర తీర భద్రత వంటి అంశాలపై ప్రదానంగా దృష్టి సారించనున్నట్టు ఇండియా వెల్లడించింది. ఈ మూడు అంశాల్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తామని ఐక్యరాజ్యసమితి (UNO)భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ట్వీట్ ద్వారా తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇండియా ఎప్పుడూ ముందుంటుందని..ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.
ఈ పదవి చేపట్టని భారత్‌కు ఫ్రాన్స్, రష్యాలు మద్దతు పలికాయి. విధుల నిర్వహణలో ఇండియాకు సంపూర్ణ మద్దతిస్తామని రష్యా, ఫ్రాన్స్(France)దేశాలు ప్రకటించాయి. భారత అజెండా స్పూర్తి దాయకంగా ఉందని రష్యా (Russia)అభినందించింది. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన, సముద్ర తీర భద్రత వంటి ప్రపంచ అంశాల్ని ఇండియా అజెండాలో చేర్చడాన్ని రష్యా ప్రముఖంగా ప్రస్తావించింది. అజెండాలోని వ్యూహాత్మక అంశాలపై ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు ఫ్రాన్స్ తెలిపింది.ఈ పదవిని ఇంతకుముందు చేపట్టిన దేశం ఫ్రాన్స్ కావడం గమనార్హం.
Also read: ఫోన్ పే, గుగుల్ పే అవసరం లేదిక..కొత్తగా ఈ రూపి..బ్యాంకు ఎక్కౌంట్ లేకుండానే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook