అంతర్జాతీయ కోర్టులో భారత్ కు ఊరట.. పాక్‌కు గట్టి షాక్ !!

అంతర్జాతీయ కోర్టు పాకిస్తాన్ సర్కార్ కు గట్టి షాక్ తగిలింది

Last Updated : Jul 17, 2019, 07:32 PM IST
అంతర్జాతీయ కోర్టులో భారత్ కు ఊరట.. పాక్‌కు గట్టి షాక్ !!

భారతీయులు ఉత్కంఠతో ఎదురుచూసిన కులభూషణ్ కేసుకు సంబంధించిన తీర్పును అంతర్జాతీయ న్యాయస్థానం వెలువరించింది. గూఢచార్యం కేసులో భారత్ కు చెందిన నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్ కు పాక్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్ష నిలిపివేస్తూ అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పును వెలువరింది. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ పున:సమీక్షించే వరకు మరణశిక్షణను నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. తాజా తీర్పుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగలగా ..భారత్ లో సంబరాలు చేసుకుంటున్నారు.

భారత్ కు చెందిన కుల్‌భూషణ్‌ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పాకిస్థాన్‌ పోలీసులు  2016 మార్చి 3న బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఆయన్ను అరెస్టు చేశారు.  ఈ క్రమంలో సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన పాక్ మిలటరీ కోర్టు కుల్‌భూషణ్‌ గూఢచర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు నిర్ధారిస్తూ 2017 ఏప్రిల్‌లో  కుల్‌ భూషన్‌కు మరణ శిక్ష విధించింది. 

కుల్‌భూషణ్‌ మరణశిక్ష విధిస్తూ పాక్ సర్కార్ తీసుకున్న చర్యను భారత్ ఖండించింది. తమ నేవీ మాజీ అధికారి కుల్‌భూషన్‌ను పాక్‌ ఉద్దేశపూర్వకంగా కిడ్నాప్‌ చేసినట్లు భారత్‌ ఆరోపించింది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న కుల్ భూషణ్ ను ఆయన తల్లి, భార్య కలిసే సమయంలో పాకిస్తాన్‌ మూర్ఖంగా ప్రవర్తించడం పట్ల భారత్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఒప్పందాలను, తీర్మానాలను ఉల్లంఘించిన పాక్‌పై ఐసీజేలో పిటిషన్‌ దాఖలు చేసింది. మరణ శిక్షను రద్దు చేసి.. వెంటనే ఆయనను విడుదల చేయాలని కోరింది. అ నేపథ్యంలో విచారణ జరిపిన ఇంటర్నేషనల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరిచింది.

Trending News