సిఐఏ డైరెక్టర్‌గా తొలి మహిళ నియామకం

అమెరికాకి చెందిన అతి పెద్ద ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థ "సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ"కి తొలిసారిగా ఓ మహిళ డైరెక్టరుగా బాధ్యతలను స్వీకరించారు.

Last Updated : May 22, 2018, 12:20 AM IST
సిఐఏ డైరెక్టర్‌గా తొలి మహిళ నియామకం

అమెరికాకి చెందిన అతి పెద్ద ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థ "సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ"కి తొలిసారిగా ఓ మహిళ డైరెక్టరుగా బాధ్యతలను స్వీకరించారు. గతంలో సీఐఏ సంస్థలో ఆఫీసరు స్థాయిలో విధులు నిర్వహించిన గినా హాస్పెల్‌‌ను డైరెక్టరుగా సీఐఏ ప్రకటించింది. 61 ఏళ్ళ హాస్పెల్ ధైర్యసాహసాలు తమను ఎన్నోసార్లు సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాయని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

ఇంటెలిజెన్స్ నిపుణులు మైక్ పాంపియోను ఇటీవలే సీఐఏ డైరెక్టర్ స్థానం నుండి స్టేట్ సెక్రటరీ పదవికి బదిలీ చేసిన క్రమంలో హాస్పెల్ ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. వర్జీనియాలోని సీఐఏ ప్రధాన కార్యాలయంలో హాస్పెల్ ఇతర మహిళా ఆఫీసర్లతో తన అనుభవాలను పంచుకున్నారు. అన్ని రకాల ఇబ్బందులను అధిగమించి ఒక మహిళగా తాను ఈ స్థాయికి రావడం గర్వకారణం అని ఈ సందర్భంగా హాస్పెల్ తెలిపారు.

గతంలో ఎన్నో ఇంటెలిజెన్స్ ఆపరేషన్లలో హాస్పెల్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా నిషేధిత ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా అనుమానితులను ఆమె డీల్ చేసిన విధానం పలు విమర్శలకు కూడా తావిచ్చింది. ఇంటరాగేషన్ పేరుతో టార్చర్ పెట్టేవారని కూడా హాస్పెల్ పై ఆరోపణలు ఉన్నాయి. అయినా అనేక అంతర్జాతీయ ఆపరేషన్స్‌లో హాస్పెల్ అపార అనుభవాన్ని గడించారు. 

Trending News