Elon Musk Issue: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఏది చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్లు వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం చేస్తున్న సమయంలో అందులోని సహాయకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఈక్రమంలోనే ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రెండున్నర లక్షల డాలర్లు(దాదాపు రూ.రెండు కోట్ల మేర) చెల్లించారని అంతర్జాతీయ మీడియా నుంచి కథనం బయటకు వచ్చింది.
ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. కావాలనే కొందరూ అసత్య ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. 2016లో ప్రైవేట్ జెట్‌లో వెళ్తుండగా స్పెస్ ఎక్స్ లో పనిచేస్తోన్న సహాయకురాలితో ఎలాన్ మస్క్ అసభ్యంగా ప్రవర్తించారని బిజినెస్ ఇన్సైడర్ స్పెషల్ స్టోరీని ఇచ్చింది. ప్లైట్లోని రహస్య గదిలో బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు తనకు మసాజ్ చేస్తే బహుమతి సైతం ఇస్తానని చెప్పినట్లు కథనం ఇచ్చారు.
ఈ వివరాలు సహాయకురాలి స్నేహితురాలు బయట పెట్టినట్లు ఇన్సైడర్ పేర్కొంది. మస్క్ ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించినట్లు వివరించింది. తన ఉద్యోగం పోతుందని గ్రహించిన బాధితురాలు 2018లో న్యాయం పోరాటానికి దిగిందన్న కథనం సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2018లో బాధితురాలికి రెండున్నర లక్షల డాలర్లు అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలను ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకున్నట్లు ఇన్సైడర్ కథనాన్ని ఇచ్చింది.
కోర్టు బయట ఈ తతంగమంతా జరిగిందని తెలిపింది. ఈ విషయం బయటకు రాకుండా ఒప్పందం సైతం జరిగిందని కథనంలో పేర్కొంది. దీనిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. దీనిపై ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తనపై చేస్తున్న ఆరోపణాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు వరుస ట్వీట్లు చేశారు.
Also read:MLC Anantha Babu Car: సుబ్రహ్మణ్యం మృతి కేసులో ట్విస్ట్..ఆర్థిక లావాదేవీలున్నాయా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.'
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook