గాంధీ, హిట్లర్ పొందిన అవార్డు.. ట్రంప్ వద్దన్నాడు.

ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రతీ యేడాది "పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ సంవత్సరం కూడా తననే ఆ అవార్డుకు ఎన్నుకొనే అవకాశం ఉందని భావించిన ట్రంప్, తనను ఆ గౌరవానికి ఎంపిక చేయవద్దని ట్విటర్ వేదికగా కోరారు.

Last Updated : Nov 25, 2017, 03:43 PM IST
గాంధీ, హిట్లర్ పొందిన అవార్డు.. ట్రంప్ వద్దన్నాడు.

ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రతీ యేడాది "పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ సంవత్సరం కూడా తననే ఆ అవార్డుకు ఎన్నుకొనే అవకాశం ఉందని భావించిన ట్రంప్, తనను ఆ గౌరవానికి ఎంపిక చేయవద్దని ట్విటర్ వేదికగా కోరారు. "ఇటీవలే టైమ్ పత్రిక వారు నన్ను కలిసి ఇంటర్వ్యూకి ఆహ్వానించారు. ఫోటో షూట్ కోసం పర్మిషన్ కూడా అడిగారు. బహుశా ఈ సంవత్సరం కూడా నన్నే "పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డుకి ఎంపిక చేసే అవకాశం ఉంది. కానీ ఆ అవార్డు నాకు వద్దు. మీకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

అయితే ఇదే విషయంపై టైమ్ పత్రిక కూడా స్పందించింది. ట్రంప్ పొరబడుతున్నారని తెలిపింది. టైమ్ యాజమాన్యం ఆ అవార్డును ప్రకటించే వరకూ ఎలాంటి ప్రకటన కూడా చేయదు. డిసెంబరు 6వ తేదీన అవార్డును ప్రకటిస్తాం అని వెల్లడించింది.  టైమ్ పత్రికకు 2016 సంవత్సరానికి డొనాల్డ్ ట్రంప్‌ను "పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ప్రకటించింది. 

టైమ్ పత్రిక అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డును ప్రకటిస్తుంది. 2015లో జర్మన్ ఛాన్సలర్‌ ఏంజిలా మెర్కల్‌ను, 2014లో ఎబోలా ఫైటర్స్ అనే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తల సంఘానికి కూడా ఈ గౌరవాన్ని కల్పించింది. పోప్ ఫ్రాన్సిస్ (2013), బరాక్ ఒబామా (2012), ప్రొటెస్టర్ మూవ్ మెంట్ (2011), మార్క్ జుకర్‌బర్గ్ (2010) మొదలైన వారు గతంలో ఈ గౌరవాన్ని పొందారు.

అయితే గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా ఈ గౌరవాన్ని రెండు సార్లు (2012, 2008) పొందారు. అదే విషయాన్ని గుర్తుపెట్టుకొని తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు చేసుంటారని కొందరు భావిస్తున్నారు. తనను కూడా రెండవ సారి ఆ గౌరవానికి ఎంపిక చేసే అవకాశం ఉందని భావించే ట్రంప్ ఆ అవార్డు తనకు ఇవ్వద్దని తెలుపుంటారని కొందరి వాదన. ఇప్పటికి ఈ గౌరవాన్ని భారత్ నుండి మహాత్మ గాంధీ ఒక్కరే అందుకున్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం చేసి బ్రిటీష్ వారిని గడగడలాడించిన గాంధీ ఆ గౌరవాన్ని పొందారు.  అలాగే హిట్లర్ (1938), స్టాలిన్ (1939), రొనాల్డ్ రీగన్ (1980) మొదలైన వారు కూడా గతంలో ఈ అవార్డు అందుకున్నారు. 

Trending News