Colombia's most wanted drug lord captured in jungle raid: మోస్ట్ వాంటెడ్ డ్రగ్ వ్యాపారి(most wanted drug lord) డైరో ఆంటోనియా ఉసుగా అలియాస్ ఒటోనియల్(Otoniel).. కొలంబియా భద్రతా బలగాల చేతికి చిక్కాడు. అవినీతి అధికారుల అండతో దశాబ్ద కాలంగా రహస్యంగా తిరిగిన ఉసుగా ఎట్టకేలకు కొలంబియా(Colombia) సైన్యానికి పట్టుబడ్డాడు. ఈ మేరకు రబ్బరు బూట్లు, సంకెళ్లు వేసిన ఉసుగా ఫొటోలను విడుదల చేశారు అధికారులు. ఉసుగా అరెస్ట్‌ను మూడు దశాబ్దాల క్రితం పాబ్లో ఎస్కోబార్(Pablo Escobar)ను పట్టుకోవడంతో పోల్చారు ఆ దేశ అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్(President Ivan Duque).
50 మిలియన్ డాలర్ల రివార్డు
ఒటోనియల్.. దట్టమైన అరణ్యాల గుండా మాదకద్రవ్యాల (కొకైన్) స్మగ్లింగ్(Smuggling) చేసే గల్ఫ్ క్లేన్ బృందానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఉత్తర అమెరికా, మధ్య అమెరికాలకు డ్రగ్స్(Drugs)ను తరలించేందుకు అనువైన ప్రధాన మార్గాలపై నియంత్రణ సాధించేందుకు హత్యలు చేసి.. ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఒటోనియల్ను పట్టుకోవడానికి అమెరికా పోలీసులు(America Police) కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో ఇతడిని చాలా కాలం ఉంచింది. అతనిపై రూ.37కోట్ల 50 లక్షలు (50 మిలియన్ డాలర్లు) రివార్డు ప్రకటించింది అమెరికా.
Also Read: Henley Passport index 2021: ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టులివే..! వీసా లేకున్నా తిరిగి రావచ్చు..!
ఉసుగా(Usuga)పై తొలిసారిగా 2009లో.. అమెరికా నిషేధిత తీవ్రవాద సంస్థకు సాయం, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఉసుగాపై అభియోగాలు మోపారు అధికారులు. 2003 నుంచి 2014 వరకు వెనిజులా, గ్వాటెమాల, మెక్సికో, పనామా, హోండురాస్ దేశాల ద్వారా 73 మెట్రిక్ టన్నుల డ్రగ్స్ అమెరికాకు చేరవేసినట్లు నేరారోపణలు రుజువవడం వల్ల బ్రూక్లిన్, మయామి ఫెడరల్ కోర్టులు ఉసుగాను దోషిగా తేల్చాయి.
అయితే తన కింద ఉన్న 500 మందికిపైగా ప్రైవేటు సైన్యం, అమెరికా, బ్రిటన్‌కు చెందిన కొందరు అవినీతి అధికారుల సాయంతో ఏళ్లతరబడి అడవుల్లోని రహస్య స్థావరంలో ఉసుగా తలదాచుకున్నట్లు అధికారులు తెలిపారు. కొలంబియాకు చెందిన గైటానిస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌కు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook