ఒక్క Tik Tok‌తోనే చైనాకు వంద కోట్ల నష్టం

గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘతానికి పాల్పడ్డనాటి నుంచి దేశంలో చైనా వస్తువులను, యాప్‌లను నిషేధించాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం చైనాకు చెందిన 59 యాప్‌లను సోమవారం నిషేధిస్తూ ఉత్తర్వులు (59 Chinese apps banned) జారీ చేసింది.

Last Updated : Jun 30, 2020, 08:06 AM IST
ఒక్క Tik Tok‌తోనే చైనాకు వంద కోట్ల నష్టం

Chinese apps banned: న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తాజాగా 59 చైనా యాప్‌లను(India Bans 59 China Apps) నిషేధించింది. గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘతానికి పాల్పడ్డనాటి నుంచి దేశంలో చైనా వస్తువులను, యాప్‌లను నిషేధించాలన్న (Ban on chinese apps) డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం చైనాకు చెందిన 59 యాప్‌లను సోమవారం నిషేధిస్తూ ఉత్తర్వులు (59 Chinese apps banned) జారీ చేసింది. Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం

చైనాకు వేలాది కోట్ల నష్టం వాటిల్లడంతోపాటు దేశ పౌరుల డేటా సురక్షితంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ 59 యాప్‌లల్లో ఒక్క టిక్‌టాక్ (Tik Tok) యాప్‌తోనే చైనా రూ.100కోట్ల నష్టాన్ని చవిచూడనుంది. దీనిప్రకారం నిషేధించిన యాప్‌లతో చైనాకు ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఊహించవచ్చు. వాహనదారులకు స్వల్ప ఊరట

అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన పది యాప్‌లల్లో ఐదు చైనావే..  
ఒక మీడియా నివేదిక ప్రకారం.. 2020 మార్చి నుంచి మే మధ్య భారత్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన 10 మొబైల్ యాప్‌లల్లో ఐదు చైనా కంపెనీలవే ఉన్నాయి. వాటిలో  టిక్‌టాక్, జూమ్, హలో, యూవీడియో, యూసీ బ్రౌజర్ ఉన్నాయి. అయితే ఒక్క జూమ్ యాప్‌ను నిషేధించిన జాబితాలో చేర్చలేదు. 

చైనాకే భారీ నష్టం..
యాప్‌ల నిషేధం వల్ల చైనాకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుందని సైబర్ ఎక్స్‌పర్ట్, సుప్రీంకోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్‌ పేర్కొన్నారు. ఇంతకుముందే ప్రభుత్వం ఈ చర్యను తీసుకోని ఉంటే బాగుండేదన్నారు. చైనా యాప్‌ల వల్ల భారతీయుల వ్యక్తిగత, ఆర్థిక డేటా నేరుగా చైనాకు చేరుకుంటుందని, దీనికి ముకుతాడు పడుతుందన్నారు. అయితే.. ఈ కంపెనీల సర్వర్లన్నీ చైనాలో ఉన్నాయని, దీంతో ప్రజల సమాచారంపాటు జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.  Harley Davidson బైక్‌పై చీఫ్ జస్టిస్ బాబ్డే.. ఫొటోలు వైరల్

పెట్టుబడులను కూడా నిషేధించాలి..
భారత స్టార్టప్ కంపెనీల్లో చైనా కంపెనీల పెట్టుబడులను ఆపడానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించాలని దుగ్గల్ సూచించారు. గత ఐదేళ్లలో ఈ స్టార్టప్‌లలో చైనా కంపెనీలు సుమారు 8 బిలియన్ల పెట్టుబడులు పెట్టాయి. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News