Sinopharm's vaccine: చైనా కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా ?

కరోనావైరస్‌ను ( Coronavirus ) ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేస్తోన్న దేశాల్లో ఒకటైన చైనా.. ఆ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) ధరను 1000 యువాన్లుగా ( 144.27 డాలర్లు ) నిర్ణయించింది. చైనాకు చెందిన జాతీయ ఫార్మాసుటికల్ గ్రూప్ సినోఫార్మ్ ( Sinopharm's Vaccine ) తయారుచేస్తోన్న వ్యాక్సిన్‌‌కి సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ( Clinical trials ) నిర్వహిస్తున్నారు.

Last Updated : Aug 22, 2020, 12:38 AM IST
  • చైనాకు చెందిన సినోఫార్మ్ తయారు చేస్తోన్న కొవిడ్-19 వ్యాక్సిన్ ధర ఖరారు.
  • అమరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ధర ఎంత ?
  • ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న ధర, ఐసిఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ ధరలతో పోల్చుకుంటే చైనా వ్యాక్సిన్‌కే ఎక్కువ ధర.
Sinopharm's vaccine: చైనా కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా ?

బీజింగ్ : కరోనావైరస్‌ను ( Coronavirus ) ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ తయారు చేస్తోన్న దేశాల్లో ఒకటైన చైనా.. ఆ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) ధరను 1000 యువాన్లుగా ( 144.27 డాలర్లు ) నిర్ణయించింది. చైనాకు చెందిన జాతీయ ఫార్మాసుటికల్ గ్రూప్ సినోఫార్మ్ ( Sinopharm's Vaccine ) తయారుచేస్తోన్న వ్యాక్సిన్‌‌కి సంబంధించి ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ( Clinical trials ) నిర్వహిస్తున్నారు. సినోఫార్మ్ తయారు చేస్తోన్న ఈ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసుల ధర రూ.10,800 వరకు ఉండవచ్చునని ఆ కంపెనీ చైర్మన్ లీ జింగ్‌జెన్ ( Liu Jingzhen ) తెలిపారు. Also read : SBI ATM: మనీ కోసం ఇక ఏటీఎంకి కూడా వెళ్లక్కర్లేదు

ప్రస్తుతం తమ వ్యాక్సిన్ యూఏఈలో చివరి దశ ప్రయోగాల్లో ఉందన్న లీ జింగ్‌జెన్.. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని అన్నారు. ఒక డోస్ అయితే కొన్ని వందల యూవాన్స్ ఉంటుందని.. అదే రెండు డోసులు ఐతే, 1,000 యువాన్స్ లోపే ఉంటుందని చెప్పిన జింగ్‌జెన్.. అదేమీ అంత ఎక్కువ ధర కాదని అభిప్రాయపడ్డారు. చైనాకు చెందిన గాంగ్‌మింగ్ అనే దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జింగ్‌జెన్ ఈ వివరాలు వెల్లడించారు. Also read : Mahesh babu: మీ కోసం ప్రార్థిస్తున్నాం సర్: మహేష్ బాబు

అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ ( Moderna's vaccine ) తయారు చేస్తోన్న వ్యాక్సిన్ రెండు డోసుల ధర సుమారు రూ.2,800 ఉండవచ్చునని తెలుస్తుండగా.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford university ) తయారు చేసే కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసుల ధర సుమారు రూ.600 లోపే ఉంటుందని సమాచారం. ఇక ఐసిఎంఆర్ ( ICMR ) సహకారంతో భారత్ బయోటెక్ ( Bharat biotech ) తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ని అంతకంటే తక్కువ ధరకే అందిస్తామని భారత్ బయోటెక్ ఎమ్‌డీ కృష్ణ ఎల్ల ( Krishna Ella ) ప్రకటించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చైనా తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కే ఎక్కువ ధర చెబుతుండటం గమనార్హం. Also read : Rhea Chakraborty: వైరల్‌గా మారిన రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాటింగ్

Trending News