COVID-19 Cases: భారత్ నుంచి విమానాల రాకపోకలు నిషేధించిన ఆస్ట్రేలియా

Australia Suspends Flights from India: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్‌లో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇదివరకే న్యూజిలాండ్, ఫ్రాన్స్, కెనడా, యూఏఈ, యూకే సహా పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించడం తెలిసిందే.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 27, 2021, 01:10 PM IST
COVID-19 Cases: భారత్ నుంచి విమానాల రాకపోకలు నిషేధించిన ఆస్ట్రేలియా

Corona Cases In India : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో కరోనా పరిస్థితులు దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలను సైతం కలవరపెడుతోంది. భారత్‌లో వరుసగా ఆరోరోజు 3 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పలు దేశాలు అప్రమత్తం అయ్యాయి. తమ దేశానికి భారత్ నుంచి విమాన సర్వీసులను నిషేధించాయి. తాజాగా ఈ జాబితాలో ఆస్త్రేలియా చేరిపోయింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్‌లో వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇదివరకే న్యూజిలాండ్, ఫ్రాన్స్, కెనడా, యూఏఈ, యూకే సహా పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించడం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి విమాన సర్వీసులను తాత్కాలికరంగా రద్దు చేసింది. భారత్‌లో కోవిడ్19(COVID-19) కేసులు, మరణాలు వేగవంతం కావడంతో ప్రస్తుతానికి మే 15వ తేదీ వరకు విమాన సర్వీసులు రద్దు చేశారు. మూడు వారాల పాటు ఈ నిషేధం ఆంక్షలు అమలులో ఉంటాయని ఆస్ట్రేలియా మీడియా రిపోర్ట్ చేసింది.

Also Read: MSR Passed Away: కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ కన్నుమూత

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ కీలక నిర్ణయం తీసుకున్నారని జర్నలిస్ట్ మిలిండా ఫారెల్ ట్వీట్ చేశారు. డైరెక్ట్ విమాన సర్వీసులతో పాటు దోహా నుంచి వచ్చే కనెక్టింగ్, ఇన్‌డైరెక్ట్ విమాన సర్వీసులపై సైతం ఈ నిషేధం మే 15వ తేదీ వరకు అమలులోకి వస్తుందన్నారు. మరోవైపు భారత్‌కు వెంటిలేటర్లు, మాస్కులు, గౌన్లు, గాగుల్స్, గ్లోవ్స్, ఫేస్ మాస్కులు, ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధప్రాతిపదికన పంపించి కరోనాపై పోరాటంలో భారత్‌కు సహాయం చేసినట్లు పేర్కొన్నారు.

భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులు రద్దు చేయాలని మొదటగా క్వీన్స్‌లాండ్ తమ దేశ ప్రభుత్వాన్ని కోరింది. ఇతర ప్రాంతాల నుంచి సైతం భారత్‌లో కరోనా పరిస్థితులపై ఆందోళన నెలకొంది. ఒకవేళ భారత్ నుంచి కరోనా మ్యుటెంట్ కొత్త రకం వైరస్ ఆస్ట్రేలియాకు వస్తే ఇక్కడ సైతం ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వానికి లేఖలు అందాయి. ఈ క్రమంలో భారత్‌ నుంచి విమానాల రాకపోకలపై ఆస్ట్రేలియా ప్రధాని మంత్రి స్కాట్ మారిసన్ దాదాపు మూడు వారాల పాటు నిషేధం విధించారు.  

Also Read: Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 10 వేలు పైగా కరోనా కేసులు, భారీగా కరోనా మరణాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News