Australia: కోవిషీల్డ్ , సినోవాక్ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆస్ట్రేలియా

Australia: దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయంగా మద్దతు గుర్తింపు లభిస్తోంది. ఇండియాలో అత్యధికంగా వ్యాక్సినేట్ అయిన కోవిషీల్డ్‌ను అంతర్జాతీయంగా గుర్తిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 1, 2021, 05:20 PM IST
  • కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయంగా పెరుగుతున్న గుర్తింపు
  • కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో పాటు సినోవాక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆస్ట్రేలియా
  • విదేశీ ప్రయాణీకుల రాకపోకలపై ఆంక్షల్ని సడలిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం
Australia: కోవిషీల్డ్ , సినోవాక్ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆస్ట్రేలియా

Australia: దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయంగా మద్దతు గుర్తింపు లభిస్తోంది. ఇండియాలో అత్యధికంగా వ్యాక్సినేట్ అయిన కోవిషీల్డ్‌ను అంతర్జాతీయంగా గుర్తిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. 

ఇండియాలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination)ప్రక్రియలో ప్రధానంగా మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్, మేడిన్ ఇండియా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌తో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు ఉన్నాయి. ఇందులో కోవాగ్జిన్‌కు అంతర్జాతీయంగా అనుమతి లేకపోవడంతో ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారికి విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు కోవిషీల్డ్ విషయంలో చాలా దేశాలు అనుమతిస్తున్నా కొన్ని దేశాలు మాత్రం ఇంకా నిరాకరిస్తున్నాయి. 

తాజాగా ఇండియాలో ఉత్పత్తి అవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు(Covishield Vaccine) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఆస్ట్రేలియా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు(Australia green signal to covishield) ఆమోదం తెలిపింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో పాటు చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్‌ను కూడా అధికారికంగా గుర్తిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆస్ట్రేలియాకు చెందిన థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆస్ట్రేలియా ప్రదాని స్కాట్ మోరిసన్ తెలిపారు. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంతో కోవిషీల్డ్, సినోవాక్ వ్యాక్సిన్లు(Sinovac vaccine) తీసుకున్నవారు ఆ దేశంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఇక నవంబర్ నెల నుంచి స్థానికులు, శాశ్వత నివాసితులకు అంతర్జాతీయ రాకపోకల్ని పునరుద్దరిస్తున్నట్టు మోరిసన్ ప్రకటించారు. వ్యాక్సినేషన్ పూర్తయినవారు..వారం రోజులపాటు హోం క్వారంటైన్‌లో(Home Quarantine)ఉండాలి. వ్యాక్సిన్ వేయించుకోనివారు మాత్రం 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సందేనని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. 

కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో ఆస్ట్రేలియా(Australia) కోవిడ్ ఆంక్షల్లో మినహాయింపులు ఇస్తోంది. విదేశీ ప్రయాణీకుల రాకపోకలపై ఆంక్షలు తొలగించే ప్రయత్నాలు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టుగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇస్తామని ఆస్ట్రేలియా చెబుతోంది. కరోనా నియంత్రణలో భాగంగా ఆ దేశంలో కోవిడ్ ఆంక్షలు ముందు నుంచీ కఠినంగా అమలవుతున్నాయి. ఆస్ట్రేలియాలో వ్యాక్సినేషన్ దాదాపు 80 శాతం పూర్తయింది.

Also read: International Coffee Day: ప్రపంచ కాఫీ దినోత్సవం ఈరోజు, కాఫీతో ప్రయోజనాలు, నష్టాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News