ఉగ్రమూకలకు అడ్డాగా మారిన పాక్ కు బుద్ధిచేప్పేందుకు అమెరికా తన ఆపరేషన్ మొదలెట్టింది. ఆ దేశానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అక్కడ ఉన్న ఉగ్రస్థావరాలపై దాడికి దిగింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే..పాక్ - ఆఫ్ఘాన్ స్థావరాలపై డ్రోన్ సాయంతో రెండు మిలైల్స్ సంధించింది. హక్కానీ నెట్ వర్క్ ప్రధాన టార్గెట్ గా చేసిన ఈ దాడిలో ఆ దళానికి చెందిన ఓ కమాండర్, ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో అమెరికా ఈ దాడి చేసింది.
అమెరికా దాడి ఉత్తిదే - పాక్
అమెరికా చేసిన ఈ దాడి పాక్ ఏ మాత్రం అంగీకరించడం లేదు. ఈ దాడికి సంబంధించిన తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇవన్నీ ఊహాగానాలేనని పేర్కొంటూ దీన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడి గురించి అంగీకరిస్తే పాక్ పరువు పోతుందనే భయంలో కావాలనే ఇలా ఈ దాడికి సంబంధించిన వివరాలు దాచిపెడుతోందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.