Operation Evacuation: ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల తరలింపు విజయవంతం

Operation Evacuation: ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ శకం ముగిసింది. అమెరికా బలగాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. ఇచ్చిన గడువులోగా బలగాల్ని తరలించి అగ్రరాజ్యం మాట నిలబెట్టుకుంది. ప్రమాదకర ఆపరేషన్‌ను సురక్షితంగా పూర్తి చేసినందుకు జో బిడెన్ కమాండోలకు ధన్యవాదాలు తెలిపారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 31, 2021, 09:46 AM IST
Operation Evacuation: ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల తరలింపు విజయవంతం

Operation Evacuation: ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ శకం ముగిసింది. అమెరికా బలగాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. ఇచ్చిన గడువులోగా బలగాల్ని తరలించి అగ్రరాజ్యం మాట నిలబెట్టుకుంది. ప్రమాదకర ఆపరేషన్‌ను సురక్షితంగా పూర్తి చేసినందుకు జో బిడెన్ కమాండోలకు ధన్యవాదాలు తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను(Afghanistan) తాలిబన్లు వశపర్చుకున్న తరువాత మిగిలిన ఏకైక ప్రక్రియ ఆఫ్ఘన్ నేల నుంచి అమెరికా బలగాల తరలింపు. ఆగస్టు 31లోగా బలగాల్ని పూర్తిగా తరలించాలని తాలిబన్లు అల్టిమేటం ఇచ్చిన నేపధ్యంలో అమెరికా ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ ప్రక్రియను పూర్తి చేసింది. గడువుకు ఇంకొన్ని గంటల సమయం మిగిలుండగానే చివరి విమానం అమెరికాకు చేరింది. దాదాపు 1 లక్షా 20 వేల అమెరికన్ పౌరులు, అమెరికా-ఆప్ఘన్ మిత్రదేశాల ప్రజల్ని తరలించినట్టు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. ఆఫ్గన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ(Operation Evacuation) పూర్తైన నేపధ్యంలో జో బిడెన్ మీడియాతో మాట్లాడారు. 

20 ఏళ్లుగా అమెరికా సైన్యం(American Military)ఆఫ్ఘన్ నేలపై అందించిన సేవలు నేటితో ముగిశాయని జో బిడెన్ తెలిపారు. నిర్దేశిత ఆగస్టు 31 వేకువజాములోగా ఎటువంటి ప్రాణనష్టం లేకుండా, అత్యంత సురక్షితంగా ప్రమాదకరమైన ఆపరేషన్ పూర్తి చేసిన కమాండర్లకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తరలింపు ప్రక్రియ పూర్తయినట్టు కాదని..అంతర్జాతీయ భాగస్వాములు, మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అటు తాలిబన్లు(Talibans) సైతం ఆ దేశం విడిచి వెళ్లాలనుకుంటున్న పౌరుల్ని సురక్షితంగా తరలించి..ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ఆఫ్ఘన్ వీడాలనుకునే అమెరికన్లు, ఇతర విదేశీ, ఆఫ్ఘన్ పౌరుల్ని సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగశాఖను ఆదేశించారు. అంతర్జాతీయ పౌరుల ప్రయాణాలపై తాలిబన్లు ఎలాంటి ఆంక్షలు విధించరని అంతర్జాతీయ సమాజం భావిస్తోందన్నారు. ఆగస్టు 31 లోగా ఎందుకు తమ బలగాల్ని తరలించామన్నది తరువాత వెల్లడిస్తానన్నారు. 

Also read: Kabul Bomb Blast Issue: అమెరికా ప్రతిదాడుల్ని ఖండించిన తాలిబన్లు, ఏకపక్ష నిర్ణయాలంటూ మండిపాటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News