ఆఫ్రికాలో భారతీయ ఓడ ఆచూకీ గల్లంతు..!

చివరిసారి ఫిబ్రవరి 1, 3.30యుటీసీ (భారత కాలగమనం ప్రకారం ఉదయం 9 గంటలు) సమయంలో వారితో మాట్లాడాము.

Last Updated : Feb 4, 2018, 10:08 AM IST
ఆఫ్రికాలో భారతీయ ఓడ ఆచూకీ గల్లంతు..!

భారత ఓడ ఆచూకీ గల్లంతైంది. 13,500 టన్నుల గ్యాసోలిన్ ను రవాణా చేస్తున్న భారత నౌక చివరగా గల్ఫ్ ఆఫ్ గినియాలోని బెనిన్ తీరంతో సంప్రదించింది.

'పశ్చిమ ఆఫ్రికా సమీపంలో గత రెండు రోజులుగా ఒక ఇంధన ట్యాంకర్ జాడ తెలియటం లేదు. ఆ ఓడలో 22 మంది భారతీయ నావికులు సహా పలు అంతర్జాతీయ సిబ్బంది ఉన్నారు' అని ఓడ యాజమాన్యం ప్రకటించింది.

'ఏఈ నియంత్రణలో ఉండే ఎంటి మెరైన్ ఎక్స్ ప్రెస్ తో బెనిన్ తీరంలోని కాటన్యూ వద్ద సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. చివరిసారి ఫిబ్రవరి 1, 3.30యుటీసీ (భారత కాలగమనం ప్రకారం ఉదయం 9 గంటలు) సమయంలో వారితో మాట్లాడాము. అధికారులు అప్రమత్తం చేశారు. వారు ఓడ గాలించే పనిలో నిమగ్నమయ్యారు" అని యాజమాన్యం సోషల్ మీడియాలో సందేశం పెట్టింది. షిప్ జపాన్ కు చెందిన యమమరు కిసేన్ యాజమాన్యానిదని గుర్తించారు.

 

బెనిన్ సమీపంలో ఉన్న ప్రాంతం, ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ గినియాని 'సముద్రపు దొంగల ప్రాంతం' అని పిలుస్తారు. అక్కడ సముద్రపు దొంగలు నౌకలను లక్ష్యంగా చేసుకుంటారని.. గ్యాసోలిన్ ను చోరీ చేసేందుకు ఓడను హైజాక్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆచూకీ లేకుండా పోయిన ఓడ కోసం నైజీరియా, బెనిన్ దేశాల సాయంతో భారత్ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.

 

Trending News