Twitter: ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు దక్కించుకున్న ఎలాన్‌మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్యోగుల సంఖ్యను దాదాపు 50శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెరిఫైడ్ యూజర్లకు నెలకు 8 అమెరికన్ డాలర్లు ఛార్జ్ చేసేందుకు ముందడుగు వేశారు.
Twitter: ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు దక్కించుకున్న ఎలాన్‌మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉద్యోగుల సంఖ్యను దాదాపు 50శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెరిఫైడ్ యూజర్లకు నెలకు 8 అమెరికన్ డాలర్లు ఛార్జ్ చేసేందుకు ముందడుగు వేశారు. మరోవైపు తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయం విటర్ యూజర్లందరిపైనా ప్రభావం చూపించనుంది. కేవలం వెరిఫైడ్ వినియోగదారులకు మాత్రమే కాకుండా ట్విటర్ యూజర్లందరి నుంచి డబ్బు వసూలు చేయాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నారని సమాచారం. ఈ మేరకు సంస్థ కీలక ఉద్యోగులతో చర్చించినట్లు తెలుస్తోంది.