భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడు (ఆగస్టు 6) పోలింగ్ జరుగుతోంది.ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరెట్ ఆళ్వా (80) బరిలో ఉన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పార్లమెంటులో పోలింగ్ జరగనుంది. లోక్సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.