Telangana Rain Updates: తెలంగాణలో అతి భారీ వర్షాలు... 8 జిల్లాలకు రెడ్ అలర్ట్..

Telangana Rain Updates: తెలంగాణవ్యాప్తంగా గత 3 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో తెరిపినిచ్చిన వాన.. రాత్రికి మళ్లీ జోరందుకుంది.

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 04:19 PM IST

Telangana Rain Updates: తెలంగాణవ్యాప్తంగా గత 3 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో తెరిపినిచ్చిన వాన.. రాత్రికి మళ్లీ జోరందుకుంది. నిన్న రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే జలాశయాలకు భారీ వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులు గేట్లు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Video ThumbnailPlay icon

Trending News