JP Nadda: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ నువ్వా,నేనా అన్నట్లు తలపడుతున్నాయి.
JP Nadda: కాళేశ్వరం ప్రాజెక్ట్..కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్ కోసం జైలు రూమ్ సిద్దం చేస్తున్నామన్నారు. కొన్ని రోజులుగా తెలంగాణలో కేంద్ర బృందాల మకాం వేస్తున్నాయని తెలిపారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాగ్ టీమ్ ఫోకస్ చేసింది. ప్యాకేజీల వారిగా నిధుల వ్యయాలను సేకరించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో రూ.వేల కోట్లు దారి మళ్లింపు జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.