MLA Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తే ముఖ్యమంత్రి స్పందించకుండా ఉంటారా అని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు దవే. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ రోహిత్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసులో కోర్టులో ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.
MLA Purchase Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో విచారణ..