Manjeera River Flow: ఉప్పొంగిన మంజీరా నది.. మహారాష్ట్రతో స్తంభించిన రాకపోకలు

Manjeera River Water: తెలంగాణ, మహారాష్ట్రల సరిహద్దున నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత బ్రిడ్జి పైనుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది.

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 01:29 AM IST

Manjeera River Water: మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన గల సింగూర్ ప్రాజెక్టుతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటీని మంజీరా నదిలోకి విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు, నిజాంసాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News