Monkey Pox: తెలంగాణలో తొలి మంకీఫాక్స్‌ కేసు!

Monkey Pox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది. మంకీఫాక్స్ మహమ్మారి తెలంగాణలోకి ఎంటరైంది. రాష్ట్రంలో తెలంగాణలో తొలి మంకీఫాక్స్‌ కేసు నమోదైందని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌‌ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. జూలై 6న ఇతను దుబాయ్ నుంచి వచ్చాడు. మంకీఫాక్స్ లక్షణాలు ఉండటంతో అనుమానిత వ్యక్తిని హైదరాబాద్‌  ఫీవర్ హాస్పిటల్‌కు తరలించారు.

 

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 03:25 PM IST

Video ThumbnailPlay icon

Trending News