Bimbisara: బింబిసారకు కాసుల పంట..దూసుకెళ్తున్న మూవీ..!

Bimbisara: తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ దుమ్మురేపుతోంది. సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఆ వివరాలు ఇవే..

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 05:57 PM IST

Bimbisara: ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలయ్యిన బింబిసార మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం వసూళ్ల జోరు కొనసాగుతోంది. తొలి రోజు రూ.7 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రెండు రోజుల కలెక్షన్లు రూ.10.80 కోట్లుగా ఉంది. మూడో రోజే ప్రాఫిట్ జోన్‌లో ఎంటరైనట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News