Banjara Hills DAV Public School Case: బంజారాహిల్స్ డిఏవి పబ్లిక్ స్కూల్ కేసులో కోర్టు సంచలన తీర్పు

Fast track court verdict in Banjara Hills DAV Public School Girl Sexual Harassments Case : రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ స్కూల్‌ ఘటనలో నాంపల్లి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆరు నెలల పాటు ఈ కేసు దర్యాప్తు కొనసాగింది. విచారణ తర్వాత శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. 

  • Zee Media Bureau
  • Apr 19, 2023, 04:03 AM IST

Fast track court verdict in Banjara Hills DAV Public School Girl Sexual Harassments Case: గతేడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డీఏవీ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్‌ను అక్టోబర్ 19న పోలీసులు అరెస్టు చేశారు. కారు డ్రైవర్‌ను తరగతి గదిలోకి అనుమతించడంపై ప్రిన్సిపల్ మాధవిపైనా కేసు నమోదు చేశారు. అయితే కోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చింది.

Video ThumbnailPlay icon

Trending News