Sharmila Comments: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రేప్ ఘటనపై రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్ తీరుపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈసందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం జరగడం దారుణమన్నారు. అధికార పార్టీ పెద్ద నాయకుల కుమారులే దారుణానికి పాల్పడ్డారని తెలిసినా..వీరిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. హోంమంత్రి మనవడు, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని తెలిసినా ఎందుకు దాచిపెడుతున్నారని మండిపడ్డారు.
నిందితులంతా అధికారపార్టీ నేతల బిడ్డలని తెలిసే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు షర్మిల. కంచె చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. అధికార అండతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఘటన జరిగి వారం రోజులైనా..చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే చర్యలు ఉండేవని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గుర్తు చేశారు. రేప్ చేయడం అంటే మర్డర్ చేయడంతో సమామన్నారు.
Also read: Salarys Cut: ఆర్టీసీ ఉద్యోగులకు భారీ షాక్.. కొత్త పీఆర్సీతో తగ్గిన వేతనాలు
Also read:CDFD Jobs: హైదరాబాద్ సీడీఎఫ్‌డీలో ఉద్యోగాల జాతర..జీతం ఎంతంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook