మంత్రి కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మంత్రికి అరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ.. ఫోరమ్ నిర్వాహకులు కేటీఆర్ కు ఆహ్వానం పంపారు.

Last Updated : Dec 27, 2017, 08:15 PM IST
మంత్రి కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మంత్రికి అరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ.. ఫోరమ్ నిర్వాహకులు కేటీఆర్ కు ఆహ్వానం పంపారు. స్విర్జర్లాండ్ లోని దావోస్- క్లొస్టర్స్ లో వచ్చే సంవత్సరం జనవరి 23-26 వ తేదీలలో జరిగే 48వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశాలు జరుగుతున్నాయి. కేటీఆర్ అక్కడి సమావేశాల్లో పాల్గొని.. వివిధ కంపెనీ సీఈవోలతో భేటీకానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఒక రాష్ట్ర మంత్రికి ఆహ్వానం అందటం ఇదే తొలిసారి. కేటీఆర్ తో పాటు ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ అరవింద్   కుమార్, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి  జయేష్ రంజన్ పాల్గొనున్నారు. 

సదస్సుకు వెయ్యికి పైగా కంపెనీ ప్రతినిధులు, ఎంపిక చేసుకున్న రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, సీఈవోలు, ఎన్జీవో , మీడియా ప్రముఖులు హాజరవుతారు. 400 సెషన్సుల్లో 100కు పైగా దేశాల నుంచి 2,500 మందికి పాల్గొంటారు.

Trending News