Woman commission Serious: బండిపై మహిళా కమిషన్ సీరియస్.. ఆ వీడియోలు పెట్టి విచారణలో వివరణ.. హెచ్చ‌రిక‌లు జారీ!

Serious Warning to Bandi Sanjay: ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు ఢిల్లీ రమ్మని కోరిన సమయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బండి సంజయ్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 18, 2023, 04:23 PM IST
Woman commission Serious: బండిపై మహిళా కమిషన్ సీరియస్.. ఆ వీడియోలు పెట్టి విచారణలో వివరణ.. హెచ్చ‌రిక‌లు జారీ!

Woman commission Serious Warning to Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు ఢిల్లీ రమ్మని కోరిన సమయంలో ఆయన మాట్లాడుతూ తప్పు చేస్తే విచారణకు పిలవకుండా ముద్దెట్టుకుంటారా? అనే విధంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఈ విషయం మీద సీరియస్ అయిన తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయడమే కాక ఈ విషయంలో మార్చి 13వ తేదీ తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

ఈ మేరకు బండి సంజయ్ కి నోటీసులు కూడా జారీ చేసింది.  అయితే తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిని అని పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాను పార్లమెంటుకు హాజరవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈరోజు అంటే 18వ తేదీ హాజరవుతానని ఆయన కోరారు. దానికి మహిళా కమిషన్ కూడా అనుమతి ఇచ్చింది, ఎట్టకేలకు ఈరోజు ఆయన మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళా కమిషన్ ముందు ఆయన హాజరైన సమయంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆయనతో పాటు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు బిజెపి మహిళా నేతలు ప్రయత్నించడం అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు వారికి అడ్డుపడడంతో పెద్ద ఎత్తున హడావిడి వాతావరణం నెలకొంది. ఇక ఎమ్మెల్సీ కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల బండి సంజయ్ పై మహిళా కమిషన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది, దాదాపు రెండున్నర గంటల పాటు సంజయ్ ను మహిళా కమిషన్ విచారించినట్టు చెబుతున్నారు. పొలిటికల్ గా, ఇంకా ఏ విధంగానైనా ఒక మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు,మరోసారి ఇలాంటి వాక్యాలు చేయకూడదని చెప్పినట్టు తెలుస్తోంది. అదే విధంగా మహిళ పట్ల పలు సందర్భాల్లో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వీడియోలు చూపించి మహిళ కమిషన్ వివరణ కోరినట్టు చెబుతున్నారు.

బతుకమ్మను, మహిళలను లంగలు, దొంగలు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలు కూడా చూపిస్తూ కమిషన్ విచారణ చేసి భవిష్యత్తులో మహిళల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అని బండి సంజయ్ కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ కవిత పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వ్రాత పూర్వకంగా వివరణ ఇచ్చిన బండి సంజయ్, అవి అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు తప్ప నేను ఎలాంటి దురుద్దేశంతో  చేయలేదని అన్నట్టు చెబుతున్నారు. అన్ని వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశపూర్వ‌కంగా చేయ‌లేదని బండి సంజ‌య్ సంజాయిషీ ఇచ్చుకున్నట్టు స‌మాచారం.

అలాగే ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల్లో క‌విత‌ను తాను అక్క‌గా సంబోధించ‌న‌ట్లు క‌మిష‌న్‌కు చెప్పిన‌ట్లుచెబుతున్నారు. అయితే మరో సారి బండి సంజ‌య్‌ని క‌మిష‌న్ విచారించే అవ‌కాశం ఉందని అంటున్నారు. మ‌హిళ‌ల‌పై మ‌రోసారి సామెత‌ల‌ను ప్ర‌యోగించొద్దంటూ క‌మిష‌న్ ఆదేశించి మ‌రోసారి ఇలా మాట్లాడితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుతోంది. ఎవ్వ‌రైనా మహిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసినట్టు చెబుతున్నారు. 

Also Read: Payal Ghosh on Jr.NTR: సౌత్లో ఆ డైరెక్టర్లతో పని చేశా..మూడో మీటింగ్లోనే రేప్.. ఎన్టీఆర్ పేరు లాగుతూ హీరోయిన్ సంచలనం!

Also Read: Allu Arjun Blocked: తన హీరోయిన్ ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. బయటపెట్టి గగ్గోలు.. అసలు విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News