/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Bandi Sanjay Gets Bail in SSC Paper Leak Case: బండి సంజయ్‌కు బెయిల్ రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. బండి సంజయ్‌కి బెయిల్ లభించిన సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. " తెలంగాణ బీజేపి నాయకుడు బండి సంజయ్‌పై అక్రమంగా బనాయించిన కేసు విచారణలో న్యాయ వ్యవస్థకు అన్నివిధాల సహకరిస్తాం " అని అన్నారు. అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని కేసీఆర్ సర్కారు కుట్రలు చేస్తోందని... ఏదేమైనా తమకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని.. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం కొనసాగిస్తున్న అరాచకాలపై బీజేపీ పోరాటం కొనసాగుతుంది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. 

బీజేపిని దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ.. ధర్మం, న్యాయం ముందు బీఆర్ఎస్ చేసే కుట్రలు, కుతంత్రాలు నిలబడవు అని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ సాగిస్తున్న నిరంకుశ పాలన, నియంతృత్వ ధోరణిని గమనిస్తున్న ప్రజలే వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలతో పాటు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు బెయిల్ లభించడం ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అభివర్ణించారు. బండి సంజయ్ కి బెయిల్ లభించిన సందర్భంగా వరంగల్‌లో బీజేపి నేతలు, కార్యకర్తలతో కలిసి టపాసులు పేల్చి సంబరాలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులో అకారణంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఇచ్చిన బెయిల్ మంజూరు ఉత్తర్వులు చెంప పెట్టు లాంటివి అని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. 

అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లతో బండి సంజయ్ సహా బీజేపీ కార్యకర్తలను ఎవ్వరినీ భయపెట్టలేరు అని ప్రేమేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్ నేతలకు స్పష్టంచేశారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించేంత వరకు, టిఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కారకులైన మంత్రి కేటీఆర్‌ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేసే వరకు, పరీక్షల రద్దు కారణంగా నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష పరిహారం అందేవరకు బండి సంజయ్ పోరాటం కొనసాగుతుంది అని ప్రేమేందర్ రెడ్డి తేల్చిచెప్పారు. 

కరీంనగర్ జైలులో బండి సంజయ్
బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ జైలులో ఉన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్‌ని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. బుధవారం ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి హన్మకొండ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను బుధవారం రాత్రే కరీంనగర్ జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో గురువారం సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఉదయం ఈ బెయిల్ డాక్యుమెంట్స్ కరీంనగర్ జైలులో సమర్పించిన వెంటనే బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : Bandi Sanjay Got Bail: బండి సంజయ్‌కి బెయిల్ మంజూరు.. కస్టడి పిటిషన్‌పై విచారణ వాయిదా

ఇది కూడా చదవండి : SSC Students Complaint on Bandi Sanjay: బండి సంజయ్‌పై పదో తరగతి విద్యార్థుల ఫిర్యాదు

ఇది కూడా చదవండి : Bandi Sanjay Arrested: బండి సంజయ్ అరెస్ట్.. బొమ్మల రామారం పీఎస్‌కి తరలింపు

Section: 
English Title: 
union minister kishan reddy, telangana bjp leaders express happiness over bail to bandi sanjay in ssc paper leak case
News Source: 
Home Title: 

Bandi Sanjay Gets Bail: బండి సంజయ్‌కి బెయిల్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..

Bandi Sanjay Gets Bail: బండి సంజయ్‌కి బెయిల్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Bandi Sanjay Gets Bail: బండి సంజయ్‌కి బెయిల్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..
Pavan
Publish Later: 
No
Publish At: 
Friday, April 7, 2023 - 00:08
Request Count: 
16
Is Breaking News: 
No