Unemployed dsc and groups aspirants protest in Hyderabad: తెలంగాణాలో నిరుద్యోగుల అంశం తీవ్ర దుమారంగా మారింది. ఒక వైపు డీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్ ల పోస్టుల సంఖ్యలను పెంచి, వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు నిరసలనలు తెలియజేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ఎగ్జామ్ పెట్టి తీరతామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల నుంచి నిరుద్యోగులు అనేక రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు. అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లో వేలాదిగా రోడ్ల మీదకు చేరుకుంటున్నారు.
సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. pic.twitter.com/PDeXwlhWJp
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2024
ప్రభుత్వం భేషజాలకు పోకుండా.. తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలనే తాము అడుగుతున్నామని, అప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ పోస్టులు సంఖ్యలను పెంచి, జంబో నోటిఫికేషన్ లు వేస్తామని నిరుద్యోగులకు హమీలుఇచ్చారు. వారి మాటల్ని తాము.. నమ్మి కాంగ్రెస్ ను గెలిపించినదుకు తమను మోసం చేయడం సరికాదన్నారు. అదే విధంగా ఇటీవల సీఎం రేవంత్ సైతం.. నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎస్సీ, గ్రూప్స్ అభ్యర్థులంతా ఒక్కసారిగా భగ్గుమున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రి (జూన్ 15) న నిరుద్యోగులు చిక్కడ పల్లిలోని సెంట్రల్ లైబ్రరీ దగ్గర తమ నిరసనలు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే డీఎస్సీ, గ్రూప్స్ఎగ్జామ్ లను వాయిదా వేసి, పోస్టుల సంఖ్యలను పెంచాలని సైతం నిరసలను తెలిపారు. సెంట్రల్ లైబ్రరీలో భారీగా నిరుద్యోగులు చేరుకుని నినాదాలు చేస్తు నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీసులు భారీ ఎత్తున సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ నిరసనలు తెలియజేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు విద్యార్థుల్నిబలవంతంగా ఈడ్చుకుని వెళ్లి పోలీసుల వాహానాల్లో ఎక్కించారు. దీంతో విద్యార్థులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ గేటును సైతం చాలా సేపు క్లోజ్ చేశారు.
సీఎం రేవంత్,కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అశోక్ నగర్, చిక్కడ పల్లి ప్రాంతారంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మహిళ నిరుద్యోగ అభ్యర్థులు అని సైతం చూడకుండా.. అర్ధరాత్రి అరెస్టులు చేసి పీఎస్ లకు తరలించడం పట్ల పలువురు విద్యార్థి సంఘాల నేతలు, రాజకీయానాయకులు ఖండిస్తున్నారు. వెంటనే సీఎం రేవంత్ భేషజాలకు పోకుండా.. నిరుద్యోగుల అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకొవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. నిరసలనకు చెందిన వీడియోలు వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి