TSRTC MD Sajjanar : ఆర్టీసీ భూములను అమ్మే ఆలోచన లేదు

Sajjanar responds on rtc depots :ఆర్టీసీ భూములను అమ్మడం, డిపోలను మూసి వేయడం వంటి ఆలోచన లేనట్లు సజ్జనార్ వెల్లడించారు. కానీ ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 03:44 PM IST
  • ఆర్టీసీ భూములను అమ్మడం, డిపోలను మూసి వేయడం వంటి ఆలోచన లేదు...
  • ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉంది..
  • జోగులాంబకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు
  • ఆర్టీసీ ఎండీ సజ్జనార్
TSRTC MD Sajjanar : ఆర్టీసీ భూములను అమ్మే ఆలోచన లేదు

TSRTC MD Sajjanar clarifies on RTC Lands Sale: ఆర్టీసీ బస్సు డిపోలను మూసి వేస్తారని, ఆర్టీసీ భూములను అమ్ముతారని వస్తోన్న వార్తలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TSRTC MD Sajjanar) స్పందించారు. ఆర్టీసీ భూములను అమ్మడం, డిపోలను మూసి వేయడం వంటి ఆలోచన లేనట్లు సజ్జనార్ వెల్లడించారు. కానీ ఆర్టీసీ (RTC) ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ బస్సులు, సిబ్బందిలో మార్పులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రయాణికులు ఇప్పుడిప్పుడే ఆర్టీసీ వైపు మళ్లుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఆర్టీసీ తీసుకుంటున్న తాజా నిర్ణయాల వల్ల సంస్థకు ఆదాయం పెరగడంతో పాటు ఓఆర్ కూడా పెరిగిందని పేర్కొన్నారు.

ఇక 1,359 రూట్లలో బస్సులను (Buses) పునరుద్ధరించామని సజ్జనార్ తెలిపారు. బస్సులు అవసరమైన చోట లోకల్ డీఎం, ఆర్ఎంలు సర్వే చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరికైనా బస్సు అవసరం ఉంటే సంబంధిత డీఎంను సంప్రదించాలని సూచించారు. జోగులాంబ వెళ్లినప్పుడు భక్తులు బస్సు కావాలని అడిగారని.. వచ్చే శనివారం నుంచి జోగులాంబకు (Jogulamba) హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సు (Special bus) నడుస్తుందని సజ్జనార్ స్పష్టం చేశారు. 

Also Read : Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్.. టాస్క్ లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్!

డీజిల్ పెరుగుదల, కరోనా అనంతర పరిస్థితులతో ఆర్టీసీ తీవ్ర ఇబ్బందులకు గురవుతోందని పేర్కొన్నారు. ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాల్సిన డీఏ, సీసీఎస్ బకాయిలను చెల్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ (RTC) లాభాల బాటలో పయనించాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని.. వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని సజ్జనార్ చెప్పారు. ఇక ఎంజీబీఎస్ స్టాళ్ల‌లో వ‌స్తువుల ధ‌ర‌లపై కూడా స‌జ్జ‌నార్ (Sajjanar) ఆరా తీశారు. స్టాళ్లలో అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే చ‌ర్య‌లు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Also Read : Moving car catches fire : అకస్మాత్తుగా మంటలు-సికింద్రాబాద్ ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News