Telangana RTC charges: తెలంగాణ ప్రజలకు మరోషాకిచ్చింది ప్రభుత్వం. ఇటీవలే కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. టికెట్ రిజర్వేషన్స్ ఛార్జీలు కూడా పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20-30 వరకు ఛార్జీలు పెరిగినట్లు తెలిపింది.
ఇటీవలే బస్ ఛార్జీల పెంపు..
ఇటీవలే పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, రూట్ బస్సుల (ఎక్స్‌ప్రెస్) ఛార్జీలు పెంచింది ప్రభుత్వం. రూ.2 నుంచి ఆపై ఛార్జీలు పెరిగాయి. అయితే ఛార్జీల పెంపు తర్వాత చిల్లకు సంబంధించి ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో రేట్లను రౌండ్ ఆఫ్ చేసింది ప్రభుత్వం.
విద్యుత్ ఛార్జీల పెంపు..
ఇటీవలే విద్యుత్ ఛార్జీలను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. క్రితంతో పోల్చితే 14 శాతం మేర ఛార్జీలు పెరిగిన విషయం తెలిసిందే.
ఇప్పటికే పెరిగిన నిత్యవసరాల ధరలతో ప్రజలు సతమతమవుతుండగా.. ఇప్పుడు బస్ ఛార్జీల వంటివి పెరగటంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వరుసగా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. దీనితో ఆ ప్రభావం అన్నింటిపైనా పడుతోందని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో డీజిల్ ధరలు మరింత పెరగొచ్చని.. అప్పుడు కూడా రవాణా ఛార్జీలు పెరిగి.. ఆ ప్రభావం వస్తు సేవల ధరలపైనా పడొచ్చని అంచనా వేస్తున్నారు.
Also read: పెళ్లిలో బిగ్ ట్విస్ట్... ఆపాలంటూ ప్రియురాలి గొడవ... జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన వరుడి బంధువులు...
Also read: Liquor Shops Hyderabad: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook