TSRTC Hikes Diesel Cess: భారీగా డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులకు మళ్లీ షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ

TSRTC Hikes Diesel Cess: తాజాగా పెంచిన డీజిల్ సెస్ రేపట్నుంచే అమలులోకి రానుందని టిఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి డీజిల్ సెస్ విధించనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది.

Written by - Pavan | Last Updated : Jun 8, 2022, 11:30 PM IST
  • మరోసారి భారీగా డీజిల్ సెస్ పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం
  • రేపట్నుంచే అమలులోకి రానున్న పెంచిన డీజిల్ సెస్
  • ఇప్పటికే పెరిగిన బస్సు చార్జీలతో ప్రయాణికులపై పడిన ఆర్థిక భారం
TSRTC Hikes Diesel Cess: భారీగా డీజిల్ సెస్ పెంపుతో ప్రయాణికులకు మళ్లీ షాక్ ఇచ్చిన టిఎస్ఆర్టీసీ

TSRTC Hikes Diesel Cess: ఆర్టీసీ ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఇటీవల పెరిగిన భారీ చార్జీలతో ప్రయాణికులపై పడిన ఆర్థిక భారం తడిసి మోపెడవుతుండగా.. తాజాగా తెలంగాణ ఆర్టీసీ మరోసారి భారీగా డీజిల్ సెస్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన డీజిల్ సెస్ రేపట్నుంచే అమలులోకి రానుందని టిఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి డీజిల్ సెస్ విధించనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు నుంచి మొదలుకుని డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీస్ బస్సుల వరకు ఈ డీజిల్ సెస్ పెంపు వర్తించనుంది.

పెంచిన డీజిల్ సెస్ చార్జీలు ఈ విధంగా ఉన్నాయి.
ప‌ల్లెవెలుగు         250 కి.మీ దూరం వరకు విధించే డీజిల్ సెస్ రూ.5 నుంచి రూ.45,
ఎక్స్‌ప్రెస్‌           500 కి.మీ దూరం వరకు విధించే డీజిల్ సెస్ రూ.5 నుంచి రూ.90,
డీల‌క్స్‌                500 కి.మీ దూరం వరకు రూ.5 నుంచి రూ.125
సూప‌ర్ ల‌గ్జ‌రీ      500 కి.మీ దూరం వరకు విధించే డీజిల్ సెస్ రూ.10 నుంచి రూ.130 
ఏసీ స‌ర్వీసులు  500 కి.మీ వరకు విధించే సెస్ రూ.10 నుంచి రూ.170

పల్లె వెలుగు బస్సులో 250 కిలో మీటర్లు దూరం వరకు 5 రూపాయల నుంచి 45 రూపాయల వరకు సెస్ వసూలు చేయనుండగా.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తే 5 రూపాయల నుంచి 90 రూపాయలు.. అలాగే ఏసీ బస్సుల్లో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే 10 రూపాయల నుంచి 170 రూపాయల వరకు డీజిల్ సెస్ విధించనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ (TSRTC Bus Fares Hike News) తమ తాజా ప్రకటనలో పేర్కొంది .

Also read : Fuel Shortage: తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత, మంత్రి ఏమన్నారంటే..?

Also read : TSRTC City Bus: ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి తర్వాత కూడా సిటీ బస్సులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News