తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్-4 రాత పరీక్ష

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్-4 రాత పరీక్ష

Last Updated : Oct 7, 2018, 08:35 AM IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్-4 రాత పరీక్ష

ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 4 రాత పరీక్ష జరగనుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరగనున్నాయి. 1,046 సెంటర్లు ఏర్పాటు చేశామని, అభ్యర్థులు పరీక్షకేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా 1,867 ఉద్యోగాలకు 4,80,545 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. జనరల్ నాలెడ్జ్, సెక్రటేరియల్ అబిలిటీస్‌లకు సంబంధించిన  ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు గానూ.. తెలుగు, ఇంగ్లిష్,  ఉర్ధూ భాషల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. కనీస అర్హత: ఓసీ- 40 శాతం, బీసీ-3 శాతం, ఎస్సీ, ఎస్టీ- 30 శాతం.    

250 ప్రత్యేక బస్సులు

గ్రూప్‌ 4 పరీక్షల దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో ఆర్టీసీ 250 ప్రత్యేక బస్సులు నడుపుతోందని ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం జరిగే గ్రూప్ 4 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

ఇవీ నిబంధనలు:

  • పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
  • అభ్యర్థులను గంట ముందు నుంచే హాల్లోకి అనుమతిస్తారు.  
  • అభ్యర్థులు తమ వెంట పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి.
  • బ్లూ, బ్లాక్‌ బాల్‌పెన్‌.. అదనంగా మరో పెన్ను తీసుకెళ్లడం మినహా ఎలాంటి వస్తువులను వెంట తీసుకెళ్లరాదు.
  • చేతి గడియారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, పర్సులు, హ్యాండ్ బ్యాగులను పరీక్షా హాల్లోకి తీసుకురాకూడదు.

Trending News