TS Eamcet Hall Tickets 2022: నేడు తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల జారీ.. అభ్యర్థులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు నేడు జారీ చేయనున్నారు.అభ్యర్థులు ఈ కింద సూచించిన స్టెప్స్‌ను ఫాలో అయి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 25, 2022, 11:05 AM IST
  • తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల జారీ నేడే
  • అభ్యర్థులు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ గురించి ఇక్కడ తెలుసుకోండి
TS Eamcet Hall Tickets 2022: నేడు తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల జారీ.. అభ్యర్థులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

TS Eamcet Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్-2022 హాల్ టికెట్లు ఇవాళ (జూన్ 25) ఆన్‌లైన్ ద్వారా జారీ కానున్నాయి. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు eamcet.tsche.ac.in ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో జూలై 11 వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ రూ.2700 ఆలస్యపు రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఎంసెట్ హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి :

1)ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in ఓపెన్ చేయండి.
2)ఎంసెట్ వెబ్‌సైట్ హోం పేజీలో 'హాల్ టికెట్ డౌన్‌లోడ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3)అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి.
4)అంతే.. స్క్రీన్‌పై మీ హాల్ టికెట్ డిస్‌ప్లే అవుతుంది.
5)హాల్ టికెట్‌పై మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
6)హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసి పెట్టుకోండి.
7)హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం చివరి నిమిషం వరకు వేచి చూడకండి. చివరి రోజు సర్వర్ డౌన్ వంటి సమస్యలు తలెత్తితే అనవసరంగా కంగారుపడాల్సి వస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జేఎన్టీయూ ద్వారా ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. ఆగస్టు 14,15,18,19,20 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: Covid Cases Updates: లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు.. ఐదు నెలల గరిష్టం.. భారత్ లో  విజృంభిస్తున్న కొవిడ్

Also Read: KCR BRS Party: ఆ తర్వాతే జాతీయ పార్టీపై ప్రకటన.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News