టీఆర్టీ పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా ప్రెస్ మీట్!

టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రెస్ మీట్

Last Updated : Feb 24, 2018, 06:51 PM IST
టీఆర్టీ పరీక్షల నిర్వహణపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా ప్రెస్ మీట్!

తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న టీఆర్టీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు పరీక్షల నిర్వహణ పూర్తయిన అనంతరం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మీడియాతో మాట్లాడారు. మొదటి రోజు టీఆర్టీ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగాయి అని ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మీడియాకు తెలిపారు. 

పరీక్షల్లో తొలి రోజైన శనివారం నాడు భాషా పండిట్ ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు జరిగాయి. 92 శాతానికిపైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రెండో రోజైన రేపు ఆదివారం జరగనున్న పరీక్షలకు మొత్తం 50 వేల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. మొత్తం 42 పరీక్షలు నిర్వహిస్తోంది అని పేర్కొన్న ఘంటా చక్రపాణి.. పరీక్షలు ముగిసిన వెంటనే కీ విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

Trending News