TRS MLA COMMENTS:కేసీఆర్ పిలుపు మేరకు దేశానికి స్వాతంత్ర్యం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విడ్డూరం

TRS MLA COMMENTS: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.

Written by - Srisailam | Last Updated : Aug 13, 2022, 05:15 PM IST
  • దేశ వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు
  • పాల్వంచ ర్యాలీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విడ్డూరం
  • కేసీఆర్ పిలుపు మేరకు దేశానికి స్వాతంత్ర్యం- వనమా
TRS MLA COMMENTS:కేసీఆర్ పిలుపు మేరకు దేశానికి స్వాతంత్ర్యం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విడ్డూరం

TRS MLA COMMENTS: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపుతో అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోనూ ఫ్రీడమ్ ర్యాలీలు తీస్తున్నారు,

భద్రాది కొత్తగూడెం జిల్లా  పాల్వంచలో  75 అడుగుల జాతీయ జెండాతో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీకి కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు 75 సంవత్సరాల క్రితం భారత దేశానికి స్వతంత్రం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే వనమా మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లోనూ కేసీఆర్ భజన చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News