MLA PA Attack: భర్తను వదిలేసి నాతో రా.. మహిళ గొంతు కోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ!

MLA PA Attack: హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత గొంతు కోశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

Written by - Srisailam | Last Updated : Sep 19, 2022, 12:04 PM IST
  • హైదరాబాద్ లో దారుణం
  • మహిళ గొంతు కోసిన యువకుడు
  • నిందితుడు ఎమ్మెల్యే పీఏగా గుర్తింపు
MLA PA Attack: భర్తను వదిలేసి నాతో రా.. మహిళ గొంతు కోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ!

MLA PA Attack: హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత గొంతు కోశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.మహిళ గొంతు కోసిన యువకుడు అధికార టీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పీఏ విజయ్ సింహగా గుర్తించారు. అర్ధరాత్రి మహిళ ఇంటికి వెళ్లిన విజయ్ ఆమెతో గొడవ పడ్డారని తెలుస్తోంది. తర్వాత తనతో తెచ్చుకున్న బీర్ బాటిల్ పగలగొట్టి మహిళ గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.  

బాధిత యువతికి విజయ్ సింహతో ఫేస్ బుక్ లో పరిచయం అయిదంటున్నారు. తర్వాత వాళ్లిద్దరు క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా మహిళను విజయ్ సింహా వేధిస్తున్నాడని తెలుస్తోంది. తన కోరిక తీర్చకపోతే చంపుతానంటూ బెదిరించాడని అంటున్నారు. భర్తను వదిలేసి తనతో ఉండాలని వేధించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో బిఎస్ మక్తాలో నివాసముంటున్న మహిళ ఇంటికి సోమవారం ఉదయం వచ్చాడు విజయ్ సింహ. తన కోరిక తీర్చాలని ఆమె బెదిరించాడు. బలవంతం చేసే ప్రయత్నం చేయగా.. ఆమె ప్రతిఘటించింది. దీంతో తనతో తెచ్చుకున్న బీర్ బాటిల్ పగలగొట్టి ఆమె గొంతు కోశాడు విజయసింహ. తర్వాత ఆమె చేయిని విరిచేశాడు. విజయసింహ దాడి చేసిన  విషయాన్ని వీడియో కాల్ చేసి భర్తకు చెప్పింది బాధిత మహిళ. ఇంటికి వచ్చిన ఆమె భర్త సూరజ్.. హాస్పిటల్ కు తరలించాడు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించారు విజయ్ సింహ. తనపై బోరబండ కార్పోరేటర్ బాబా ఫసియుద్దీన్ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించాడు.

Also read:  AP CAPITAL: సీబీఐ కేసులో జగన్ లాయరే సుప్రీంకోర్టు సీజేఐ.. ఏపీ రాజధాని కేసుపై టీడీపీ నేతల డౌట్స్?  

Also read: ఈ వారం మరో షాక్.. ఏకంగా తొమ్మిది మంది నామినేషన్స్ లోకి.. ఎవరెవరంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News