local body quota mlc: తెరాస(TRS) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. పార్టీ అధిష్టానం 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ప్రకటించనుంది. ఎంపికైన అభ్యర్థులు రేపు, ఎల్లుండి నామినేషన్లు(Nominations) దాఖలు చేయనున్నారు.
స్థానిక సంస్థల కోటా(Telangana MLC elections 2021)లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16న నామినేషన్లు ప్రారంభం కాగా 23 వరకు నామపత్రాలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్(Polling) నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు. కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు ఉండగా... ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానం ఉంది. మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఖాళీగా ఉంది.
Also Read: ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్- 3-4 రోజులు అక్కడే!
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
ఖమ్మం- తాత మధు
ఆదిలాబాద్ - దండే విఠల్
మహబూబ్‌నగర్ -సాయి చంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి
రంగారెడ్డి- శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి
వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి
నల్గొండ- ఎం.సి.కోటిరెడ్డి
మెదక్- యాదవరెడ్డి
కరీంనగర్- ఎల్.రమణ, భాను ప్రసాదరావు
నిజామాబాద్ - కల్వకుంట్ల కవిత లేదా ఆకుల లలిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల వీరే..!