Revanth Reddy: అమెరికాలో రేవంత్... హైదరాబాద్ లో భట్టీ మీటింగ్! కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Revanth Reddy: కాంగ్రెస్ అంటేనే మూడు వర్గాలు.. ఆరు పంచాయతీలు. వర్గ  పోరు ఆ పార్టీలో కామన్ అని చెబుతారు. పార్టీ బలంగా ఉన్నా.. బలహీనంగా ఉన్నా ఆ పార్టీ నేతల తీరు మారదని అంటారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతున్నా... పార్టీలోని వర్గపోరు ఆయనకు సమస్యలు తెచ్చి పెడుతోంది.కేడర్ ను గందరగోళంలో పడేస్తోంది.

Written by - Srisailam | Last Updated : May 31, 2022, 10:43 AM IST
  • అమెరికా పర్యటనలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
  • జూన్ 1,2 తేదీల్లో టీకాంగ్రెస్ చింతన్ శివిర్
  • రేవంత్ రెడ్డి లేకుండా సభ నిర్వహణపై రచ్చ
Revanth Reddy: అమెరికాలో రేవంత్... హైదరాబాద్ లో భట్టీ మీటింగ్! కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

Revanth Reddy: కాంగ్రెస్ అంటేనే మూడు వర్గాలు.. ఆరు పంచాయతీలు. వర్గ  పోరు ఆ పార్టీలో కామన్ అని చెబుతారు. పార్టీ బలంగా ఉన్నా.. బలహీనంగా ఉన్నా ఆ పార్టీ నేతల తీరు మారదని అంటారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి దూకుడుగా వెళుతున్నా... పార్టీలోని వర్గపోరు ఆయనకు సమస్యలు తెచ్చి పెడుతోంది.కేడర్ ను గందరగోళంలో పడేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు తాము కలిసికట్టుగానే ఉన్నామని చెబుతున్నా.. మీడియా ముందు ఫోజులు ఇస్తున్నా.. అంతర్గతంగా మాత్రం పార్టీలో వర్గ పోరు తీవ్రంగానే ఉందని తెలుస్తోంది. తాజాగా జూన్ 1, 2 తేదీల్లో  హైదరాబాద్ లో జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ చింతన్ శివిర్ సమావేశంఆ పార్టీలో సెగలు రేపుతోంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో ఈ సమావేశం జరగనుంది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ అమెరికాలో ఉన్న సమయంలో చింతన్ శివిర్ నిర్వహిస్తుండటం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. భట్టీ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఆఫీస్ బేరర్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అనుబంధ సంఘాల నేతలు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇటీవల జరిగిన చింతన్ శివర్ లో కాంగ్రెస్ హైకమాండ్ పలు తీర్మానాలు చేసింది.చేసిన తీర్మానాలను ఆమోదించడంతో పాటు రాష్ట్ర పరిస్థితులపై మేథోమథం చేయనుంది భట్టీ బృందం. భవిష్యత్ కార్యాచరణపైనా చర్చించనుంది. రాష్ట్ర పార్టీ బలోపేతంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. పార్టీ పరంగా అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ సమావేశాన్ని... పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండగా నిర్వహిస్తుండటం ఇప్పుడు చర్చగా మారింది.

రేవంత్ రెడ్డి టార్గెట్ గానే భట్టి విక్రమార్క టీమ్ ఈ సమావేశం నిర్వహిస్తుందనే టాక్ వస్తోంది. ఇటీవలే రెడ్డి సంఘం సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు రేవంత్ రెడ్డి కామెంట్లపై గుర్రుగా ఉన్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ గౌడ్ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. అందులో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు మధుయాష్కి. పార్టీలోని ఇతర బీసీ లీడర్లు కూడా రేవంత్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. భట్టీ సారథ్యంలో జరగనున్న సమావేశంలో రేవంత్ 'రెడ్డి ' వ్యాఖ్యలపై చర్చిస్తారని తెలుస్తోంది.పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉన్నందున రేవంత్ రెడ్డితో వివరణ ఇప్పించాలనే యోచనలో బీసీ నేతలు, పార్టీ సీనియర్లు ఉన్నారని అంటున్నారు. అందుకే రేవంత్ రెడ్డి అందుబాటులో లేని సమయంలో భట్టీ టీమ్ ఈ సమావేశానికి ప్లాన్ చేసిందని చెబుతున్నారు.

భట్టీ నిర్వహించనున్న సమావేశం గురించి అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి నిరంతరం ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. తన అనుచరులతో ఆయన వివరాలు తీసుకుంటున్నారని అంటున్నారు. భట్టీ సమావేశానికి రేవంత్ రెడ్డి వర్గం నేతలు కూడా భారీగా హాజరుకానున్నారని తెలుస్తోంది. సమావేశంలో రేవంత్ రెడ్డి కామెంట్లపై చర్చ జరిగితే తిప్పి కొట్టాలని భావిస్తున్నారట. అదే సమయంలో రేవంత్ వ్యతిరేక వర్గం కూడా పోటీగా వ్యూహాలు రచిస్తుందని సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్ మేథోమథన సమావేశం హాట్ హాట్ గా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరీ భట్టీ సారథ్యంలో జరగనున్న సమావేశం సాఫీగా సాగుతుందా లేక రచ్చగా మారనుందో..

READ ALSO: MLC Kavitha: ఉద్యోగ కల్పనలో శ్రీలంకతో పోటీ.. మోడీ సర్కార్ ఫెయిల్ అన్న కవిత

READ ALSO: Rains in Telangana: వాతావరణ శాఖ హెచ్చరిక... నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News