Revanth Reddy: మేం దాడులు చేయాలనుకుంటే నువ్వు, నీ కుటుంబం బయట తిరిగేది కాదు కేసీఆర్.. రేవంత్ రెడ్డి వార్నింగ్

Congress Kollapur Public Meeting: కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని.. మరో లక్ష కోట్లు దోచుకునేందుకు మళ్లీ అధికారం ఇవ్వమంటున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని.. ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరుస్తామన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 31, 2023, 07:54 PM IST
Revanth Reddy: మేం దాడులు చేయాలనుకుంటే నువ్వు, నీ కుటుంబం బయట తిరిగేది కాదు కేసీఆర్.. రేవంత్ రెడ్డి వార్నింగ్

Congress Kollapur Public Meeting: పేదోళ్ల దేవత ఇందిరమ్మ.. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఉక్కుమహిళ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం తపించిన వీర వనిత వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాని చెప్పారు. కొల్లాపూర్‌కు ప్రియాంక గాంధీ రావాల్సి ఉండేదని.. అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో రాహుల్ గాంధీ మీ కోసం హుటాహుటిన ఇక్కడకు వచ్చారని అన్నారు. హెలికాప్టర్‌లో వెళ్లడం ప్రమాదమని చెప్పినా.. మీ కోసం రిస్క్ చేసి ఇక్కడకు వచ్చారని పేర్కొన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

"కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు. మూడోసారి సీఎం చేయాలని కేసీఆర్, ఆయన కుటుంబం అడుగుతోంది. ఇంకో లక్ష కోట్లు దోచుకోవడానికి కేసీఆర్ మూడోసారి అధికారం ఇవ్వమంటున్నారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని  కొల్లగొడతారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కి ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి తెలంగాణ కల సాకారం చేసిన  సోనియమ్మ రుణం తీర్చుకుందాం. పాలమూరు జిల్లాలో 14 కు 14 గెలిపించాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉంది. పాలమూరు పసిడి పంటల జిల్లాగా మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.

మీ వాడిగా మీ బిడ్డగా అడుగుతున్నా.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నా.. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతీ ఇంటికి చేరాలి. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. కాంగ్రెస్ వస్తే రైతు బంధు రద్దవుతుందని కేసీఆర్ అంటుండు.. కేసీఆర్‌కు అసలు బుద్ది ఉందా..? రైతు భరోసా ద్వారా రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు సోనియమ్మ ప్రకటించింది.." అని రేవంత్ రెడ్డి అన్నారు.

దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థిపై దాడి నెపం కాంగ్రెస్‌పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేయదలచుకుంటే.. కేసీఆర్.. నువ్వు నీ కుటుంబం బయట తిరిగేది కాదని వార్నింగ్ ఇచ్చారు. ప్రాణాలు ఇవ్వడమే కానీ.. దాడుల సంస్కృతి కాంగ్రెస్‌ది కాదన్నారు. కాంగ్రెస్‌పై నెపం నెట్టి బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మండిపడ్డారు.

Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Also Read: Minister Harish Rao: ఎంపీ ప్రభాకర్‌ రెడ్డిపై కోడికత్తి దాడి అంటూ అపహాస్యం.. మంత్రి హరీష్ రావు కౌంటర్.!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News