ఓల్డ్ సిటీ రాజకీయం; ఎంఐఎం అంతుచిక్కని వ్యూహం ఇదే..

                                                

Last Updated : Nov 22, 2018, 01:53 PM IST
ఓల్డ్ సిటీ రాజకీయం; ఎంఐఎం అంతుచిక్కని వ్యూహం ఇదే..

తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎంకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గం తీసుకున్నా..జనాలు ఓ సారి ఒక పార్టీని ఆదరిస్తే..మరో సందర్భంలో మరో పార్టీవైపు మొగ్గుచూపుతారు. కానీ ఓల్డ్ సిటీలో పరిస్థితి భిన్నం. ప్రత్యర్ధి ఎవరైనా విజయం మాత్రం ఎంఐఎందే. గత పాతికేళ్ల నుంచి ఇదే పరిస్థితి. దీనికి ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజలతో సంబంధాలు, ప్రజా సమస్యలపై పోరాటం, మత రాజీయాలు ఇలా అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఓవైసీ రాజకీయ వ్యూహమే ఆ పార్టీ ఓల్డ్ సిటీలో పాగ వేయడానికి ప్రధాన కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు

ఎంఐఎం పార్టీ లాజిక్ ఇదే...
ఓల్డ్ సిటీ రాజకీయ చరిత్రను పరిశీలించినట్లయితే తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎం పార్టీ దోస్తీ కోరుకుంటుంది. అలాగే ఎంఐఎం కూడా అధికార పార్టీకే మద్దతిచ్చేందుకు ముందుకు వస్తుంది. ఇక్కడే దాగి ఉంది ఎంఐఎం లాజిక్. ప్రధాన పార్టీల ఆలోచన తీరును బట్టి ఎంఐఎం పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. క్షణ్ణంగా పరిశీలించినట్లయితే ఎంఐఎం ఏ ఒక్క పార్టీకి  పూర్తి స్థాయిలో దగ్గర కాదు.. అలాగని ఎవరితోనూ ( బీజేపీ మినహాయించి )  వైరం పెంచుకోదు. ప్రస్తుత పరిణామాలే ఇందుకు నిదర్శనం.

ప్రధాన పార్టీలను నియంత్రిస్తోంది 
ఒకవైపు టీఆర్ఎస్ తన మిత్ర పక్షమని చెబుతూనే ఆ పార్టీతో స్నేహపూర్వక పోటీ చేస్తోంది. ఫలితంగా ఓల్డ్ సిటీలో నామామాత్రంగా టీఆర్ఎస్ తమ అభ్యర్ధులను నిలబెట్టేలా చేయగల్గింది. ఇటు మహకూటమికి ఎన్నికల్లో తగిన సీట్లు రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎంఐఎం అవసరం రావచ్చు. భవిష్యత్తు రాజకీయ అవసరాలే మహాకూటమికి ఆ పార్టీతో వైరం పెంచుకోకుండా చేస్తోంది. ఫలితంగా ఎంఎంఐపై నామామాత్రంగానే తమ అభ్యర్ధులను నిలబెడుతోంది.

హిందుత్వ బూచీతో గట్టెక్కుతోంది..

అయితే ఒక్క బీజేపీ మాత్రమే ఎంఐఎం పార్టీతో ఢీ అంటే ఢీ అంటోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఓల్డ్ సిటీలో కమలం పార్టీకి అంతగా పట్టు లేదనే అభిప్రాయం బలంగా ఉంది. పైగా ఆ పార్టీ మత రాకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ఇదే ఎంఐఎంకు వరంగా మారుతోంది. ప్రధాన పార్టీలను నామామాత్రం బరిలోకి దిగేలా చేయగల్గడం, బీజేపీ హిందుత్వ ఎజెండా బూచిగా చూపించి ముస్లింలు ఓట్లు కొల్లగొడుతోంది. ఇలా ఓవైసీ పార్టీ సునాయసంగా గట్టెక్కగల్గుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Trending News