Telangana Inter board: 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్నాయి. జూన్ 15 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ఆరంభమవుతాయని పేర్కొంది. అకాడమిక్‌కు సంబంధించి తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 220 పని రోజులున్నాయి.
ఈమేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటనను వెలువరించింది. ఈ ఏడాది మొత్తం 221 పని దినాలున్నాయి. జూన్ 1 నుంచి మొదటి సంవత్సరం, జూన్ 15 నుంచి రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2 నుంచి 9 వరకు దసరా సెలవులున్నాయి. జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయి.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలుంటాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 31 వేసవి సెలవులు ఉంటాయని ప్రకటనలో తెలిపారు. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్, సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. వచ్చే ఏడాది జూన్ 1న కాలేజీలు పునర్ ప్రారంభంకానున్నాయి.
Also read: Revanth Reddy: రాహుల్ గాంధీ జీ..మరోసారి రండి..రేవంత్ రెడ్డి పిలుపు..!
Also read: Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు శుభవార్త..అందుబాటులోకి స్టార్ ప్లేయర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook